తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Leo Movie Fans marriage : 'లియో' స్పెషల్.. థియేటర్​లో దండలు మార్చుకున్న జంట! - విజయ్ లియో సినిమా ఓటీటీ

Leo Movie Fans marriage : విజయ్ తాజా చిత్రం 'లియో' ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో ఎక్కడ చూసినా లియో మేనియా నడుస్తోంది. అయితే సాధారణంగా తమ అభిమాన స్టార్​ సినిమా వస్తే.. ఫ్యాన్స్​ థియేటర్​కు వెళ్లి డ్యాన్స్​లు, ఈలలతో సందడి చేయడం చూసుంటాం. అయితే చెన్నైలోని ఓ అభిమాన జంట మాత్రం ఏకంగా దండలు మార్చుకుని ఒకటయ్యారు. ఆ విశేషాలు మీ కోసం..

Leo Movie Fans marriage : 'లియో' స్పెషల్.. థియేటర్​లో దండలు మార్చుకున్న జంట!
Leo Movie Fans marriage : 'లియో' స్పెషల్.. థియేటర్​లో దండలు మార్చుకున్న జంట!

By ETV Bharat Telugu Team

Published : Oct 19, 2023, 3:47 PM IST

Updated : Oct 19, 2023, 5:36 PM IST

Leo Movie Fans marriage:దళపతి విజయ్, లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన 'లియో' చిత్రం నేడు ( అక్టోబర్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ల దగ్గర విజయ్ అభిమానులు బుధవారం నుంచే తెగ రచ్చ చేస్తున్నారు. సినిమా బాణాసంచా పేలుస్తూ.. సంబరాలు చేసుకున్నారు. అయితే ఓ అభిమాని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చెన్నైకు చెందిన వెంకటేశ్, మంజుష అనే జంట పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెళ్లి కోసం ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 19 న లియో విడుదల కావటం వల్ల.. పెళ్లిని ఆ తరవాత రోజు అక్టోబరు 20న పెట్టుకున్నారు. థియేటర్​కు సంప్రాదాయ దుస్తుల్లో వచ్చారు. ప్రేక్షకుల ముందు దండలు ఉంగరాలు మార్చకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ మాట్లాడుతూ.. షూటింగ్ చేసేటప్పుడు ఒత్తిడి అనిపించలేదు గానీ.. రిలీజ్​కు ముందు మాత్రం కాస్త కంగారు పడినట్లు తెలిపారు. లియో తీయడానకి మాస్టర్​ సినిమానే అసలు కారణం అని అన్నారు. విజయ్​ సినిమాలు అంటే ఏదో ఒక కాంట్రావర్సీ అవుతుందని తెలిపారు. లియో విషయంలో ట్రైలర్​లో అభ్యంతర పదాలు ఉన్నాయని ఎన్నో విమర్శలు వచ్చాయన్నారు. ఒక వేళ అది కాకపోతే మరొక విషయం వార్తల్లో నిలిచేదని చెప్పారు. అలానే సినిమాను తెరకెక్కించటం వరకే నా పని.. బిజినెస్ తనకు సంబంధించిన వ్యవహారం కాదని ఆయన స్పష్టం చేశారు.

లియో చిత్రం మిక్స్​డ్​ టాక్​తో థియేటర్లలో రన్ అవుతోంది. సినిమాను చూసిన వారు సోషల్​ మీడియాలో ఎలా ఉందో తెలుపుతున్నారు. తాజాగా ఈ చిత్రంపై దర్శకుడు ప్రశాంత్​ నీల్ కూడా స్పందించారు. లియో సినిమా బాగుందని.. విజయ్​ యాక్షన్​ సీన్స్ వేరే లెవెల్లో ఉన్నాయని అన్నారు. అలానే అనిరుధ్ మ్యూజిక్ అదిరిపోయింది. అందరూ థియేటర్​ను వెళ్లి ఆ సర్​ప్రైజ్​ను చూసి థ్రిల్ అవ్వండి అని చెప్పారు. ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్లు పేర్కొన్నారు.

Leo Movie Telugu Review : సినిమాలో ఆ 3 ప్లస్, మైనన్​ పాయింట్స్​.. లోకేశ్​ మ్యాజిక్​కు ఆడియెన్స్​ రెస్పాన్స్​ ఇదే!

Bhagavanth Kesari Movie Review : బొమ్మ దద్దరిల్లింది.. కానీ సినిమాలో మైనస్​ ఏంటంటే?

Last Updated : Oct 19, 2023, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details