Leo Lcu Connection :దళపతి విజయ్ నటించిన లియో మూవీ మరో రోజులో గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను వీక్షించి తన రివ్యూను ఇచ్చారు తమిళనాడు మినిస్టర్, హీరో ఉదయ నిధి స్టాలిన్. సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్‌తో ఇప్పటివరకు కొనసాగుతున్న ఓ సస్పెన్స్ గురించి దాదాపుగా క్లారిటీ ఇచ్చేశారు. మరి ఆ ట్వీట్‌తో స్టాలిన్ నిజంగానే హింట్ ఇచ్చారా లేదా విజయ్ ఫ్యాన్స్‌ను ట్వీట్ చేశారో తెలియాల్సి ఉంది.
అసలీ 'లియో' చిత్రం లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమా కాదా అన్న సందేహం మాత్రం సినీ ప్రియుల్లో, విజయ్ ఫ్యాన్స్‌లో మాత్రం భారీగా నెలకొంది. అక్టోబర్ 19న(Leo Movie Release Date) ఈ చిత్రం విడుదల కాబోతుంది. అంటే రేపటితే దీనిపై స్పష్టత రానుంది. కానీ ఈలోపే సినిమా రివ్యూను ఉదయనిధి స్టాలిన్ సోషల్ మీడియా ట్వీట్ పెట్టి ఎల్సీయూ గురించి హింట్ ఇచ్చేశారు.
చిత్రంలో విజయ్ నటన, యాక్షన్ అదిరిపోయిందని చెప్పారు ఉదయ నిధి స్టాలిన్. లోకేశ్ కనకరాజ్ ఫిల్మ్ మేకింగ్ అద్భుతంగా ఉందని, అనిరుధ్ మ్యూజిక్, అన్భరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ అన్నీ సూపర్ అని అన్నారు. మొత్తంగా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ చాలా బాగుందని, మీవీటీమ్కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.