Leo Box Office Collection Day 1 :తమిళ నటుడు దళపతి విజయ్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'లియో'. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా తమిళంలో ఆశించిన స్థాయిలో టాక్‌ను అందుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షాన్ని కూడా కురిపించింది.
అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే అత్యధిక వసూళ్లను అందుకున్న ఈ సినిమా మొదటిరోజు మంచి బిజినెస్ చేసింది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. తొలిరోజు ఈ చిత్రం సుమారు రూ.140కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కోలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది.
మరోవైపు నార్త్ అమెరికాలో అక్టోబర్ 19న విడుదలైన అన్ని సినిమాల్లో 'లియో' టాప్ ప్లేస్‌లో ఉంది. ఓ కోలీవుడ్ సినిమా ఇలా ఓవర్సీస్‌లో టాప్ వన్‌లో కొనసాగడం అనేది చాలా అరుదు అంటూ అభిమానులు ట్విట్టర్లో పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు.
Leo Movie Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. స్టార్ డైరక్టర్ లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కథానాయికగా త్రిష, కీలక పాత్రల్లో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్ తదితరులు నటిస్తున్నారు. మ్యూజిక్ డైరక్టర్‌గా అనిరుధ్ పనిచేశారు. ఈ సినిమాను 7 స్క్రీన్స్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లతిత్ కుమార్ నిర్మించారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ప్రీమియర్ షోకు అనుమతి కూడా ఇచ్చింది.
ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి నిత్యం ఏదోక వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన విజయ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో అభిమానులు తెగ ట్రెండ్ చేశారు. మూవీ టీమ్ విడుదల చేసినలియో ట్రైలర్లో లియోదాస్గా విజయ్ యాక్టింగ్, ఆయన మీద చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు సినిమా మీద భారీ అంచనాలను పెంచాయి.
Leo Movie OTT Details : 'లియో' ఓటీటీ డీటెయిల్స్ లీక్!.. అంత త్వరగా స్ట్రీమింగా?.. ఎప్పుడంటే?
Leo Movie Twitter Review : విజయ్ 'లియో' రివ్యూ.. 'రోలెక్స్'తో ఫైట్... లోకేశ్ మ్యాజిక్ చేశాడా లేదా?