Leo Audio Launch Cancelled : స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'లియో'. అక్టోబర్ 19న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో లాంఛ్ ఈవెంట్‌పై ఫ్యాన్స్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజాగా దీనిపై మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. అందుకు గల కారణాలను వివరించారు.
"లియా మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్‌కు భారీగా ఫ్యాన్స్ వచ్చే అవకాశముంది. అంతమందికి ఎంట్రీ పాస్‌లు ఇవ్వాలంటే కుదరదు. అందుకే భద్రతా కారణాలతో ఆడియో రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం. అభిమానుల కోసం నిరంతరం ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లు ఇస్తూనే ఉంటాం. అయితే, అందరూ భావిస్తున్నట్లు మా మీద ఏ రాజకీయ పార్టీ ఒత్తిడి లేదు. మరే ఇతర కారణాలు లేవు" అని ట్వీట్ చేసింది.
మేకర్స్ క్లారిటీ ఇచ్చినా..
Leo Audio Launch Cancelled Or Not : అయితే మేకర్స్ క్లారిటీ ఇచ్చినప్పటికీ విజయ్ ఫ్యాన్స్.. ఈవెంట్ రద్దుకు రాజకీయ ఒత్తిళ్లే కారణమని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. విజయ్ స్పీచ్‌ను మిస్ అవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సోషల్‌మీడియాలో ఇంటర్వ్యూయేనా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Leo Audio Launch Issue : లియో మేకర్స్ తీసుకున్న నిర్ణయాన్ని ఏజీసీ సినిమాస్ సీఈవో అర్చన కళాపతి స్వాగతించారు. అభిమానుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈవెంట్ రద్దు చేయడాన్ని ప్రశంసించారు. ఆడియో లాంఛ్ జరగనప్పటికీ.. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఉంటాయని అంచనా వేశారు.