'మత్తువదలరా' సినిమాతో తొలి ప్రయత్నంలోనే సినీప్రియుల్ని మెప్పించారు దర్శకుడు రితేష్ రానా. ఇప్పుడాయన 'హ్యాపీ బర్త్‌డే'తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నరేష్ అగస్త్య, వెన్నెల కిషోర్, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని జులై 15న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఇప్పుడీ చిత్రాన్ని జులై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.
ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ కొత్త పోస్టర్ విడుదల చేశారు. "వినోదంతో నిండిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. లావణ్య సరికొత్తగా కనిపించనుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి" అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: కాలభైరవ, ఛాయాగ్రహణం: సురేష్ సారంగం.