తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సలార్‌' నుంచి న్యూ అప్డేట్​.. యాంగ్రీ లుక్‌లో స్టార్​ హీరో! - salar prabhas news

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ నటిస్తున్న 'సలార్'​ మూవీ నుంచి సరికొత్త అప్డేట్​​ వచ్చింది. మూవీలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రముఖ నటుడి లుక్​ను చిత్రబృందం విడుదల చేసింది.

latest-update-from-salaar-team
latest-update-from-salaar-team

By

Published : Oct 16, 2022, 11:48 AM IST

Salaar Latest Update: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తోన్న బిగ్గెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'సలార్‌'. 'కేజీయఫ్‌' ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కిస్తున్నారు. మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ఆదివారం పృథ్వీరాజ్‌ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రియులకు 'సలార్‌' టీమ్‌ అదిరిపోయే అప్డేట్​ ఇచ్చింది.

పృథ్వీరాజ్‌

పృథ్వీరాజ్‌ లుక్‌ని రివీల్‌ చేసింది. ఇందులో ఆయన.. వరదరాజ మన్నార్‌ పాత్రలో యాంగ్రీ లుక్‌లో కనిపించారు. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్‌ రఫ్‌ లుక్‌లో కనిపించనున్నారు. శ్రుతిహాసన్‌, జగపతి బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రం హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details