Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసే ఉంటుంది. వెండితెరపై ఆయనను చూస్తే అభిమానులకు పూనకమే. అలాంటి రజనీ 71 ఏళ్ల వయసులోనూ టాప్ స్టార్లకు పోటీ ఇస్తున్నారు. ఇప్పుడు తన రేంజ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. తన గత సినిమా 'పెద్దన్న' తమిళ్లో హిట్ అయ్యినప్పటికీ.. తెలుగులో మాత్రం సినిమా రొటీన్ ఎమోషన్స్ వల్ల పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీనితో రజనీ మార్క్ మాస్ కం బ్యాక్‌ను మన దగ్గర కూడా ఆశిస్తున్న ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు.
ఈ సమయంలోనే రజనీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇండియాలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలపై టాక్ నడుస్తుండగా.. సూపర్‌స్టార్ రజనీకాంతే ఇండియాలో టాప్ ఉన్నారని కోలీవుడ్ వర్గాల వారు న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అక్కడి వారు చెబుతున్న ప్రకారం.. రజనీ తన కొత్త సినిమా 'జైలర్' కోసం ఏకంగా రూ. 140 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని అంటున్నారు. దీనిపై పూర్తి స్పష్టత లేదు.