'జబర్దస్త్' వేదికపై నటించే జోడీలకు ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. అలాంటి జోడీల్లో ఇమ్మాన్యుయెల్-వర్ష ఒకటి. ఎన్నో ఎపిసోడ్స్, స్పెషల్ షోస్‌లో వీళ్లిద్దరి రొమాంటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరింది. పైగా వీళ్లిద్దరూ రియల్ లైఫ్ లవర్స్ కూడాను. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని ఈ జంట పలుసార్లు పరోక్షంగానూ తెలిపింది.
గతంలో వర్ష.. ఇమ్మాన్యుయెల్‌ను లేకుండా లైఫ్‌ను ఊహించుకోవడం కష్టమంటూ 'జబర్దస్త్' స్టేజ్‌పైనే తెలిపింది. ఈ జోడీ కలిసి పలు మార్లు మ్యారేజ్ స్కిట్లు కూడా చేశారు. స్టేజ్‌పై తమ మధ్య కెమిస్ట్రీతో ప్రేక్షకులను బాగా అలరించారు. అయితే ఇప్పుడు మరోసారి పెళ్లికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే తమ పెళ్లి జరగాలంటే ఇమ్మాన్యుయెల్‌కు ఓ కండీషన్ పెట్టింది వర్ష. పెళ్లి జరగాలంటే చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉండాలని తెలిపింది. దీంతో ఇమ్మూ.. తనకు చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్ వీళ్లంతా తెలుసని అంటాడు. దీంతో వారిని పెళ్లికి తీసుకురమ్మని వర్ష చెప్పింది. ఆమె కోరికని కాదనలేకపోయిన ఇమ్మూ... సెలబ్రిటీలను రంగంలోకి దించాడు. అయితే వారు చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణను గెటప్‌లు వేసుకుని.. డ్యాన్స్‌లతో అదరగొట్టారు. సిగ్నేచర్ స్టెప్పులతో సందడి చేశారు. అలా వీరి స్క్రిట్ బాగా నవ్వులు పూయించింది.