సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌కు ఇటీవలే భారీ సర్‌ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైలర్ సినిమాతో బిజీగా ఉన్న ఆయన.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఆ చిత్రాల అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు.
తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించబోతున్న కొత్త సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్‌లు ప్రధాన పాత్రల్లో నటించబోతున్న ఈ చిత్రానికి లాల్ సలామ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను లైకా ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. ఈ పోస్టర్లో మంటల్లో కాలుతున్న ఒక హెల్మెట్‌ను చూపించారు. దీనితో పాటు పక్కన ఓ బాల్, వికెట్ బెల్స్ పడుండటం కన్పిస్తుంది. దీనిని చూస్తుంటే ఈ సినిమాను స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు అర్ధమవుతుంది. అభిమానుల్లో మూవీపై క్యూరియాసిటీ పెరుగుతోంది.