సూపర్ స్టార్ రజినీకాంత్ తనయ ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందనున్న తమిళ సినిమా 'లాల్ సలామ్'. ఈ చిత్ర షూటింగ్ మంగళవారం చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. విష్ణు విశాల్, విక్రాంత్ నటిస్తున్న ఈ చిత్రం.. ఈ ఏడాదే విడుదల కానుంది. దీనిని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలను గతేడాది నవంబరులో ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు రెహ్మాన్. అయితే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.
ఇకపోతే ఈ సినిమాలో తలైవా రజినీకాంత్ కూడా ఓ అతిథి పాత్రను పోషించనున్నారట. సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న 'జైలర్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ చిత్రీకరణ తర్వాతే తలైవా 'లాల్ సలామ్' షూటింగ్‌కు సమయం కేటాయించనున్నారట. కొత్త పోస్టర్లో తెల్లటి యూనిఫారంలో ఉన్న పురుషుల గుంపు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న మంటల్లో పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే సినిమా కథాంశమేంటో పూర్తిగా తెలియనప్పటికీ.. క్రికెట్ ఆధారంగానే ఈ 'లాల్ సలామ్' సినిమా ఉంటుందని సమాచారం. అయితే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ వారం రోజుల పాటు జరగనుందని సమాచారం. ప్రస్తుతం తమిళనాడులో సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో జరుగుతోంది. 'లాల్ సలామ్'లో నటిస్తున్న కొందరు నటీనటులు కూడా ఈ లీగ్‌లో ఆడుతున్నారు. వారు ఈ మ్యాచ్‌లు ఆడటానికి వీలుగా వారాంతంలో షూటింగ్‌ను పక్కన పెట్టనున్నారు.