తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'లాల్ సలామ్' టీజర్ ఔట్ - రజనీ ఫ్యాన్స్​కు డబుల్ ధమాకా! - thalaivar 170 updates

Lal Salaam Teaser : తలైవా రజనీకాంత్ కుమార్తె తెరకెక్కిస్తున్న సినిమా 'లాల్ సలామ్​'. అదివారం దీపావళి పండగ సందర్భంగా మూవీటీమ్ టీజర్​ రిలీజ్​ చేసింది.

Lal Salaam Teaser
Lal Salaam Teaser

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2023, 2:53 PM IST

Updated : Nov 12, 2023, 5:01 PM IST

Lal Salaam Teaser : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కిస్తున్న సినిమా 'లాల్ సలామ్​'. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్​పై ఈ సినిమా రూపొందుతోంది. రజనీకాంత్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఆయితే ఆదివారం దీపావళి సందర్భంగా చిత్రబృందం.. సినిమా టీజర్ విడుదల చేసింది. టీజర్ రిలీజైన గంటల్లోనే యూట్యూబ్​లో మిలియన్ వ్యూస్​తో దూసుకుపోతోంది. మరి మీరు ఈ టీజర్ చూశారా?

టీజర్​ ప్రారంభంలో ఒక చిన్న గ్రామాన్ని చూపించారు. అక్కడ క్రికెట్ పోటీలో రెండు జట్లు హోరాహోరీగా తలపడతాయి. ఇరు జట్ల సభ్యులు.. భారత్ - పాకిస్థాన్​ మ్యాచ్​ రేంజ్​లో ఎమోషన్స్​ చూయిస్తారు. అంటే ఈ రెండు వర్గాల మధ్య ఏవో తగాదాలున్నట్లు అర్థమౌతోంది. వీరి గొడవలను పరిష్కరించేందుకు తలైవా రజనీకాంత్ (మొయిదీన్ భాయ్‌).. రంగంలోకి దిగుతాడు. మరి ఈ సమస్య మొయిదీన్ భాయ్‌ ఎలా పరిష్కరిస్తాడు? సినిమాలో కీలక పాత్ర చేస్తున్న విష్ణు విశాల్​కు ఈ సంఘటనకి ఎలా లింక్ కుదిరిందనేది తెరపై చూడాల్సిందే

'లాల్ సలామ్'​..బాలీవుడ్​ బ్లాక్​బస్టర్ 'కై పొ చే (Kai Po Che)' సినిమాకు రీమేక్​గా 'లాల్ సలామ్' రూపొందుతున్నట్లు టాక్​ వినిపిస్తోంది. ఈ సినిమాలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా రజనీ.. మొయిదీన్ భాయ్‌ అనే స్పెషల్ రోల్​ చేయడం వల్ల ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగాయి. అలాగే ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ సతీమణి జీవిత నటిస్తున్నారు. ఆమె దాదాపు 33 ఏళ్ల తర్వాత వెండితెర పై కనిపించనున్నారు. ఈ సినిమా తమిళ్​ సహా.. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది.

Thalaiva 170 : మరోవైపు రజనీ ఇటీవల 'జైలర్' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ జోష్​లో ఆయన మరో రెెండు సినిమాలను ఓకే చేశారు. ప్రస్తుతం ఆయన.. టీజే జ్ఞానవేల్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తలైవా 170' (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు.

తలైవా నిర్ణయానికి అన్న మద్దతు

11 రోజుల్లో 'రజనీ' ఖాతాలో రూ.200 కోట్లు..!

Last Updated : Nov 12, 2023, 5:01 PM IST

ABOUT THE AUTHOR

...view details