తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

తలైవా ఫ్యాన్స్ గెట్​రెడీ - 'లాల్ సలామ్' టీజర్ వచ్చేస్తోంది - thalaivar 170 updates

Lal Salaam Teaser : తలైవా రజనీకాంత్ కుమార్తె తెరకెక్కిస్తున్న 'లాల్ సలామ్​' సినిమా టీజర్​ గురించి అప్​డేట్ వచ్చింది. ఈ మేరకు మూవీటీమ్.. టీజర్ రిలీజ్ డేట్​ను అఫీషియల్​గా అనౌన్స్​మెంట్ చేసింది.

Lal Salaam Teaser
Lal Salaam Teaser

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 8:12 PM IST

Updated : Nov 10, 2023, 10:16 PM IST

Lal Salaam Teaser : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కిస్తున్న సినిమా 'లాల్ సలామ్​'. బాలీవుడ్​ బ్లాక్​బస్టర్ 'కై పొ చే (Kai Po Che)' సినిమాకు రీమేక్​గా ఈ సినిమా రూపొందుతున్నట్లు ఇన్​సైట్ టాక్. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్​పై ఈ సినిమా రూపొందుతోంది. 2024 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన మూవీయూనిట్.. తాజాగా టీజర్​కు సంబంధించిన అప్​డేట్ ఇచ్చింది.

2023 నవంబర్ 12 ఆదివారం ఈ సినిమా టీజర్​ను దీపావళి కానుకగా రిలీజ్​ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. "గెట్​రెడీ ఫర్ ప్రీఫేస్ లాల్ సలామ్" అంటూ ట్విట్టర్​లో అధికారికంగా పోస్ట్​ చేసింది. ఇక ఈ సినిమాలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తలైవా రజనీ.. అతిథి పాత్రలో మెరవనున్నారు. ముఖ్యంగా రజనీ.. మొయిదీన్ భాయ్‌ అనే స్పెషల్ రోల్​ చేయడం వల్ల ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగాయి. అలాగే ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ సతీమణి జీవిత నటిస్తున్నారు. ఆమె దాదాపు 33 ఏళ్ల తర్వాత వెండితెర పై కనిపించనున్నారు. ఈ సినిమా తమిళ్​ సహా.. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది.

హార్డ్​డిస్క్​లు మాయం? రెగ్యులర్ షెడ్యూల్స్​తో ఈ సినిమా.. షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. అయితే రజనీకాంత్​పై చిత్రీకరించిన కొన్ని సీన్స్​ హార్డ్​ డిస్క్​లో కనిపించట్లేదని నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. షూటింగ్ దాదాపు చివరి దశలో ఉండగా ఇలా జరగడం వల్ల మూవీయూనిట్ ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. తలైవా సీన్స్​ను హార్డ్​ డిస్క్​ల్లోంచి వెలికి తీసేందుకు.. టెక్నీషియన్లను విదేశాల నుంచి రప్పించనున్నారట. కానీ, దీనిపై మూవీటీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Thalaiva 170 : మరోవైపు రజనీ ఇటీవల 'జైలర్' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ జోష్​లో ఆయన మరో రెెండు సినిమాలను ఓకే చేశారు. ప్రస్తుతం ఆయన.. టీజే జ్ఞానవేల్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తలైవా 170' (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు.

Thalaivar 170 Update : రజనీ ఫ్యాన్స్​కు కిక్కిచ్చే న్యూస్.. 'తలైవా 170' షూటింగ్ షురూ!

Thalaivar 170 Cast : మూవీ లవర్స్​కు డబుల్​ ట్రీట్​.. సూపర్ స్టార్​ సినిమాలోకి ఆ ఇద్దరి ఎంట్రీ..

Last Updated : Nov 10, 2023, 10:16 PM IST

ABOUT THE AUTHOR

...view details