Laal Singh Chaddha telugu trailer: బాలీవుడ్ స్టార్హీరో ఆమిర్ ఖాన్ నటించిన కొత్త చిత్రం 'లాల్ సింగ్ చడ్డా'. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య కీలక పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ఆడియో ఫంక్షన్‌ను నిర్వహించారు. చిరంజీవి దీన్ని విడుదల చేశారు.
ఆ పని తొందర పడి చేయలా, గర్వపడి చేశా: చిరంజీవి - chiranjeevi Laal Singh Chaddha
ఆమిర్‌ఖాన్, నాగచైతన్య నటించిన 'లాల్‌సింగ్ చడ్డా' తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమిర్‌పై తనకున్న అభిమానాన్ని తెలిపారు.
ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. "ఆమీర్ ఖాన్ భారతీయ సినిమాకు ఒక ఖజనా. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో గొప్పనటుడు అనిపించుకున్నారు. ఆయన నడక, నడవడిక అంటే నాకు చాలా ఇష్టం. అమీర్ ఖాన్ లాగా మేం చేయాలనుకుంటాం, మాకున్న లిమిట్స్ వల్ల చేయలేకపోతున్నాం. నేను తొందరపడి ఈ సినిమా విడుదలకు ఒప్పుకోలేదు, గర్వపడి విడుదల చేస్తున్నా. ఆమీర్ పై ప్రేమ, బాధ్యతతో లాల్ సింగ్ చడ్డాకు సమర్పకుడిగా ఉన్నాను." అని అన్నారు. అనంతరం చిరంజీవికి ఆమిర్ పానీ పూరి తినిపించారు. ఈ సందర్భంగా ఆమిర్‌తో నాగచైతన్య తెలుగులో డైలాగ్ చెప్పించి అలరించారు.
ఇదీ చూడండి: Anchor Udayabhanu: ఫ్యాన్స్ కోసం ఆ షోకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుందా?