తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'లాల్​సింగ్​చడ్డా' ఓపెనింగ్స్​ ఫెయిల్​.. గత 13ఏళ్లలో ఇదే తొలిసారి - aamir khan latest news

Aamir khan Laal singh chadda collections: ఆమిర్​ఖాన్​ 'లాల్​సింగ్​ చడ్డా', అక్షయ్​కుమార్​ 'రక్షాబంధన్'​.. బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల​ విషయంలో తొలి రోజు బోల్తా కొట్టాయి. అత్యంత దారుణమైన ఓపెనింగ్స్​ను అందుకున్నాయి. ఎంతంటే?

.
.

By

Published : Aug 12, 2022, 11:49 AM IST

Aamir khan Laal singh chadda collections: భారతీయ చిత్ర పరిశ్రమలో ఆమిర్​ఖాన్​ రేంజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'దంగల్‌'తో ఇండియన్‌ సినిమా హిస్టరీలో ఆల్‌టైమ్‌ హయ్యెస్ట్‌ గ్రాసింగ్‌ మూవీని అందించిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌.. నాలుగేళ్ల తర్వాత లాల్​సింగ్​ చడ్డాతో సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిశారు. అయితే ఆగస్టు 11న విడుదలైన ఈ మూవీ మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ.. కలెక్షన్ల విషయంలో దారుణంగా విఫలమైంది. ఆమిర్‌ రేంజ్‌కు ఏమాత్రం తగని ఓపెనింగ్స్ ఇవి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.10.75 కోట్లు మాత్రమే అందుకుంది. గత 13 ఏళ్లలో ఆమిర్​ కెరీర్​లో ఇదే అత్యంత తక్కువ ఓపెనింగ్స్​. ఆయన కెరీర్​లో డిజాస్టర్​గా నిలిచిన ధగ్స్​ ఆఫ్ హిందుస్థాన్​... తొలిరోజే రూ.52కోట్లు అందుకోవడం గమనార్హం.

అసలే కొన్నాళ్లుగా అంతంతమాత్రంగా ఉన్న బాలీవుడ్‌.. లాల్‌ సింగ్‌పై భారీ ఆశలే పెట్టుకున్నా.. తొలి రోజు మాత్రం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే రానున్నది లాంగ్‌ వీకెండ్‌ కావడం వల్ల వసూళ్లు పెరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రంతో పాటు రిలీజైన అక్షయ్‌ కుమార్‌ రక్షా బంధన్‌ కూడా నిరాశపరిచింది. తొలి రోజు రూ.8-805 కోట్లు వసూలు చేసిందని తెలిసింది. ఈ సినిమాకు కూడా పూర్తిగా నెగటివ్‌ రివ్యూలు వచ్చాయి.

ఇదీ చూడండి: ఏం క్రేజ్​రా బాబు.. మొన్న విజయ్​దేవరకొండ.. ఇప్పుడు ఈ హీరో కోసం..

ABOUT THE AUTHOR

...view details