తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Kushi Twitter Review : థియేటర్లలోకి సామ్​- విజయ్​ 'ఖుషి'.. సినిమా ఎలా ఉందంటే? - Kushi Movie audience talk

Kushi Twitter Review : రౌడీ హీరో విజయ్​ దేవరకొండ, టాలీవుడ్​ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ 'ఖుషి'. భారీ అంచనాల నడుమ ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్​గా రిలీజైంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందంటే ?

Kushi Twitter Review
ఖుషి మూవీ ట్విట్టర్​ రివ్యూ

By ETV Bharat Telugu Team

Published : Sep 1, 2023, 6:37 AM IST

Updated : Sep 1, 2023, 7:30 AM IST

Kushi Twitter Review :రౌడీ హీరోవిజయ్​ దేవరకొండ టాలీవుడ్​ బ్యూటీ సమంత నటించిన లేటెస్ట్ మూవీ 'ఖుషి'. 'మజిలీ' ఫేమ్​ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్​గా రిలీజైంది. సాంగ్స్​, ప్రమోషనల్​ ఈవెంట్స్​తో మంచి టాక్​ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రీమియర్స్​ చూసిన అభిమానులు సోషల్​ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఖుషి ఏలా ఉందంటే ?

భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ 'ఖుషి' సినిమాకు ఆడియెన్స్​ నుంచి మంచి రెస్పాన్స్​ వస్తోంది. ఇదొక సింపుల్ స్టోరీ అని.. ఇందులో విజయ్, సామ్​ బాగా నటించారని ఒక నెటిజన్ ట్వీట్​ చేయగా. ఇక ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించగా.. సెకండ్​ హాఫ్‌లో ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయని మరొకరు అభిప్రాయపడ్డారు.

Vijay Devarakonda Kushi Review : చివరి 30 నిమిషాలు సీన్లు ఎమోషనల్‌గా ఉన్నాయని.. సాంగ్స్, విజయ్ దేవరకొండ యాక్షన్ ఈ సినిమాకు ప్లస్​ పాయింట్​ అని మరో నెటిజన్ చెప్పుకొచ్చారు. 'ఖుషి' మూవీ వినోదంగా సాగే క్లీన్ రొమాంటిక్ కామెడీ చిత్రం అని.. రెగ్యులర్ స్టోరి, కొంత నిడివి సాగదీసినట్టు ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా ఉందంటూ మరొకరు ట్వీట్​ చేశారు. సినిమాలో కామెడీ బావుందని ఎక్కువ మంది పేర్కొన్నారు. సినిమాకు ముందు నుంచే మంచి రెస్పాన్స్​ అందుకున్న సాంగ్స్​.. స్క్రీన్ మీద కూడా బాగున్నాయంటూ మరొకరు రాసుకొచ్చారు.

Kushi Movie Cast : ఇక 'ఖుషి' సినిమా విషయానికి వస్తే.. 'మజిలీ' ఫేమ్​ దర్శకుడు శివ నిర్వాణ.. లవ్​ అండ్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో జయరామ్​, మురళి శర్మ, సచిన్ ఖేడాకర్, అలీ, లక్ష్మి, వెన్నెల కిశోర్, రోహిణి, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్​ అయ్యంగర్​ తదితరులు నటించారు. మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందించారు. మరోవైపు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్​ కూడా జోరుగా సాగాయని.. బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Vijay Devarakonda Kushi : 'థియేటర్​ నుంచి బయటకు ఖుషీగా వస్తారు.. ఆ విజువల్‌ కోసం వెయిటింగ్​'

Kushi Musical Concert : 'సామ్​ గురించి అప్పుడే తెలిసింది.. ఆమె ముఖంలో నవ్వు చూడాలని..'

Last Updated : Sep 1, 2023, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details