Khusi Rerelease : పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన ఒకప్పటి సూపర్ హిట్ చిత్రం 'ఖుషి'. ఎస్.జె.సూర్య దర్శకుడు. భూమిక కథానాయిక. సుమారు 21 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రాన్ని శనివారం రీ రిలీజ్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించింది. ఆయా థియేటర్ల వద్దకు భారీగా చేరుకున్న పవర్‌స్టార్ అభిమానులు టపాసులు కాల్చుతూ.. డ్యాన్స్‌లు చూస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్క్రీన్‌పై వింటేజ్ పవన్‌కల్యాణ్‌ని చూసి పేపర్లు ఎగురవేశారు. మరోవైపు పవన్‌కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సైతం ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేశారు. హైదరాబాద్‌లోని దేవి 70ఎంఎం థియేటర్‌కు చేరుకున్న ఆయన సినిమా చూస్తూ, స్క్రీన్‌పై తన తండ్రి కనిపించగానే ఫొటోలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
పవన్ కల్యాణ్ 'ఖుషి' మేనియా.. థియేటర్‌లో అకీరా సందడి.. - ఖుషి రీరిలీజ్ ఎస్జే సూర్య పవన్ కల్యాణ్
Khusi Rerelease : టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల సందడి కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల చిత్రాలు విడుదల కాగా, తాజాగా పవర్‌స్టార్ నటించిన 'ఖుషి' మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
గత కొన్నిరోజులుగా తమ అభిమాన హీరోల పాత చిత్రాలను విడుదల చేయాలని డిమాండ్ వస్తోంది. దీంతో నిర్మాతలు ఆ చిత్రాలను అప్‌డేట్ చేసి మళ్లీ థియేటర్లలో విడుదల చేయడం ట్రెండ్‌గా మారింది. ఇలా విడుదల చేసిన చిత్రాలకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో చిత్ర బృందాలు ప్రత్యేక రోజులను పురస్కరించుకొని సూపర్‌హిట్ చిత్రాలను మళ్లీ విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'ఖుషి' చిత్రానికి సాంకేతికంగా మరిన్ని హంగులు జోడించి విడుదల చేశారు. 4కే రిజల్యూషన్, 5.1 డాల్బీ ఆడియోతో 'ఖుషి'ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.