Kushi Musical Concert :టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ఖుషి'. 'జిలి'ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ టీమ్ ప్రమోషన్స్‌ను శరవేగం చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఓ 'మ్యూజికల్ కాన్సర్ట్'ను నిర్వహించింది. ఇందులో విజయ్, సమంత పాల్గొని అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపారు. జోడీగా డ్యాన్స్ కూడా చేశారు. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలిపోయారు. ఇక ఈవెంట్లో సమంత గురించి విజయ్ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఇక ఇదే స్టేజ్ పై సమంతతో పాటు దర్శకుడు శివ నిర్వాణ కూడా మాట్లాడారు.
Vijay Devarakonda About Samantha : "సెప్టెంబరు 1న నా తరఫున 'ఖుషి' తీసుకొస్తున్నాను. మీరంతా నవ్వుతూ బయటకు వచ్చిన సినిమాని ఎప్పుడు ఇచ్చానో నాకు గుర్తులేదు. 'విజయ్ బ్రో సెప్టెంబరు 1న నీ ముఖంలో నవ్వు చూడాలని ఉంది. అదొక్కటే గుర్తుపెట్టుకుని పనిచేస్తున్నాను' అని శివ నెల నుంచి చెబుతున్నారు. నా ముఖంలో కాదు సమంత ముఖంలో నవ్వులు చూడాలని ఉంది. ఆమె ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నేను మాటల్లో చెప్పలేను. గతేడాది ఏప్రిల్‌లో నవ్వుతూనే సినిమాను ప్రారంభించాం. కానీ షూటింగ్ ఆఖరి దశలో ఉన్న సమయంలోనే సమంత ఆరోగ్యం కాస్త దెబ్బతింది. అయితే స్క్రీన్‌పై బాగానే కనిపిస్తుందని మేము కూడా తేలిగ్గా తీసుకున్నాం. కానీ ఆమె పరిస్థితి తర్వాత అర్థమైంది. కొన్ని రోజులు విరామం తీసుకోమని చెప్పాం. కొన్ని రోజులకు నేను వేరే సినిమా ప్రమోషన్లో ఉన్న సమయంలో ఆమె పరిస్థితి గురించి తెలిసింది" అని పేర్కొన్నారు.