Kushi Day 2 Box Office Collection : రౌడీ హీరోవిజయ్ దేవరకొండ.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతనటించిన లేటెస్ట్ మూవీ 'ఖుషి'. 'మజిలీ' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. తొలి రోజు ఊహించని స్థాయిలో వసూలు చేసిన 'ఖుషి'.. రెండో రోజు కాస్త డీలా పడ్డట్లు అనిపించింది. రెండో రోజు ఈ సినిమా రూ.9 కోట్లు వసూలు అందుకుంది. ఈ క్రమంలో రెండు రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.51 కోట్లకు పైగా సాధించిందట.
Kushi USA Collections : ఇక ఈ మూవీ ఓవర్సీస్లోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తూ రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరిపోయిందని సమాచారం. ఇలా ఓ సినిమా ఓవర్సీస్లో రెండు రోజుల్లోనే మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి రావడం విశేషం.
Samantha Movies In USA : మరోవైపు ఈ సినిమాతో సమంత ఓ అరుదైన రికార్డును అందుకున్నారు. ఇప్పటి వరకు సమంత నటించిన 17 చిత్రాలు అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరాయట. అలా 'ఖుషి' వల్ల సమంత ఖాతాలో ఓ అరుదైన రికార్డు పడింది.