Kushi Collections :అతి తక్కువ కాలంలోనే బలమైన అభిమానగణాన్ని సొంతం చేసుకున్న హీరో.. ది విజయ్ దేవరకొండ. 'లైగర్'తో భారీ డిజాస్టర్‌ను అందుకున్న ఆయన.. తాజాగా 'ఖుషి' అనే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సమంతతో కలిసి ఇందులో నటించారు. శివ నిర్వాణ దర్శకుడు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రానికి అమెరికాలో వేసిన ప్రీమియర్ షోలతోనే పాజిటివ్ టాక్ దక్కింది(Kushi Review). విప్లవ్, ఆరాధ్య పాత్రల్లో విజయ్, సామ్ అద్భుతంగా నటించారని సినీ ప్రియులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకుల ఆశించిన దాన్ని కన్నా స్పందన ఇంకాస్త ఎక్కువగానే వచ్చింది. దీంతో ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి.
Kushi Movie Pre Release Business : ఈ చిత్రానికి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 20 కోట్లు.. మొత్తంగా రూ.41 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ. 52.50 కోట్లు బిజినెస్ చేసిందట.