తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Kushi Bookings: ఇక 'ఖుషి' వంతు.. బుకింగ్స్​ షురూ.. సెప్టెంబర్​ బాక్సాఫీస్​కు సవాల్​! - kushi booking opening date

Kushi Bookings: టాలీవుడ్​ ఆగస్ట్​ బాక్సాఫీస్ ముగిసింది. ఇక మరో రెండు రోజుల్లో ఖుషి సినిమాతో సెప్టెంబర్​ మొదలుకానుంది. బుకింగ్స్​ కూడా మొదలయ్యాయి. మరి ఈ చిత్రం ఎలాంటి ఆరంభాన్ని ఇస్తుందో?

Kushi Bookings
Kushi Bookings

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 1:05 PM IST

Kushi Bookings :ఆగస్ట్​ నెల టాలీవుడ్​కు మంచి బూస్ట్​ ఇచ్చింది. నెల ప్రారంభంలోనే సూపర్ స్టార్​ రజనీకాంత్‌ నటించిన 'జైలర్‌' మైండ్ బ్లాక్ అయ్యే వసూళ్లను అందుకుంది. ఇక నెల చివర్లో వచ్చిన 'బెదురులంక 2012', 'బాయ్స్‌ హాస్టల్‌' లాంటి చిన్న చిత్రాలు కూడా మంచిగానే ఆడాయి. అయితే ఇప్పుడు సెప్టెంబర్ వంతు వచ్చింది. సెప్టెంబరు మొదటి రోజే విజయ్‌ దేవరకొండ - సమంతల ఖుషి రాబోతుంది(Vijay Devarkonda Samantha Kushi).

ఇదే నెక్ట్స్​ టాలీవుడ్​లో పెద్ద​ రిలీజ్​ మూవీ. ఈ సినిమాకు మజిలీ, నిన్నుకోరి వంటి ప్రేమ కథలను తెరకెక్కించిన శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. లవ్​ అండ్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా ఈ చిత్రం మంచి అంచనాలతో పాన్ ఇండియా రేంజ్​లో మరో రెండు రోజుల్లో రాబోతుంది(kushi movie release date). బాక్సాఫీస్​ వద్ద మంచి ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేసుకుంటున్నారు.

తాజాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్​ కూడా బుక్​ మై షో, పేటీఎంలో ప్రారంభం అయ్యాయి. ఈ విషయాన్ని మూవీటీమ్​ తెలిపింది. ఇక ఈ చిత్ర ఫైనల్ కాపీ రన్ టైమ్ 2 గంటల 43 నిమిషాలు అంటే​ మొత్తం 163 నిమిషాలు ఉన్నట్లు తెలిసింది. మొదటి భాగం​ గంట 19 నిమిషాలు ఉండగా.. రెండో​ గంట 24 నిమిషాలు ఉందట. అంటే మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగమే కాస్త ఎక్కువ సేపు నిడివి ఉందని అర్థమైంది. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు మంచిగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హేషమ్ అబ్దుల్ వాహబ్​ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్​-సమంత కెమిస్ట్రీ కూడా బాగుందంటూ సినీ ప్రియులు తమ అభిప్రాయాల్న వ్యక్తం చేస్తున్నారు.

సినిమాలో జయరామ్​, మురళి శర్మ, సచిన్ ఖేడాకర్, అలీ, లక్ష్మి, వెన్నెల కిశోర్, రోహిణి, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్​ అయ్యంగర్​ కూడా నటించారు. మైత్రి మూవీ మేకర్స్​ సినిమాను ప్రొడ్యూస్ చేసింది. చూడాలి మరి మంచి అంచనాలతో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ నెలకు ఎలాంటి ఆరంభాన్ని ఇస్తుందో.. అలాగే వరుస పరాజయాలతో ఉన్న విజయ్ దేవరకొండ​-సమంత-శివ నిర్వాణకు విజయాన్ని అందిస్తుందో లేదో..

Samantha America Tour : అది సామ్​ క్రేజ్.. ఒక్కో టికెట్​ రూ.2 లక్షలు.. నిమిషాల్లో హాట్​కేకుల్లా అమ్ముడుపోయాయట!

Kushi Musical Concert : 'సామ్​ గురించి అప్పుడే తెలిసింది.. ఆమె ముఖంలో నవ్వు చూడాలని..'

ABOUT THE AUTHOR

...view details