తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

లాకప్​లో నటుడు.. పదిరోజులు తిండి తినకుండా నీటితోనే..

ఓ కేసులో అరెస్ట్​ అయిన నటుడు పదిరోజుల పాటు లాకప్​లోనే ఉండి తాజాగా బెయిల్​పై విడుదలయ్యాడు. అయితే తాను ఈ పది రోజుల పాటు తిండి తినకుండా కేవలం నీరు మాత్రమే తాగి జీవనం సాగించినట్లు చెప్పాడు. దీంతో తాను పది కిలోల బరువు తగ్గిపోయినట్లు పేర్కొన్నాడు.

krk
కేఆర్​కే

By

Published : Sep 13, 2022, 3:06 PM IST

Updated : Sep 13, 2022, 3:31 PM IST

వివాదస్పద ట్వీట్ల కేసులో అరెస్టు అయిన బాలీవుడ్ విమర్శకుడు, నటుడు కమల్​ రషీద్​ ఖాన్​.. ఇటీవలే విడుదలయ్యాడు. అయితే తాజాగా సోషల్​మీడియా ద్వారా జైలులో తాను ఎలా గడిపాడో వివరించాడు. పది రోజుల పాటు అక్కడ తిండి తినలేదని, కేవలం నీళ్లు మాత్రమే తాగి గడిపినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో తాను పది కేజీల బరువు తగ్గినట్లు పేర్కొన్నాడు. "పది రోజులపాటు లాకప్​లో తిండి తినకుండా కేవలం నీరు మాత్రమే తాగి బతికాను. అందుకే పది కేజీల బరువు తగ్గాను" అని ట్వీట్​ చేశాడు.

దాని ముందు ట్వీట్​లో "నేను సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చాను. నేను ఎవరీ కక్షల్లో భాగం కావాలని అనుకోవడం లేదు. జరిగిన విషయాన్ని మర్చిపోయాను. నా రాత ఇలా జరగాలని రాసి ఉంది అని అనుకుంటున్నాను" అని రాసుకొచ్చాడు. అంతకుముందు ట్వీట్​లో బాలీవుడ్ సీనియర్​ నటుడు శత్రుఘ్న సిన్హాకు ధన్యవాదాలు తెలిపాడు. అయితే ఎందుకో తెలీదు. ఇలా ఈ మూడు రోజుల్లో వరుసగా మూడు ట్వీట్లు చేశాడు.

కాగా, గతంలో(2020) దివంగత బాలీవుడ్‌ నటులు రిషీకపూర్‌, ఇర్ఫాన్‌ఖాన్‌లపై వివాదాస్పద ట్వీట్‌లు చేసిన కారణంగా అప్పట్లో కేఆర్‌కేపై కేసు నమోదయ్యింది. అప్పటినుంచి కోర్టుకి హాజరవ్వని అతడిని ఇటీవలే ఆగస్టు29న థానే పోలీసులు ముంబయి ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కొందరినుంచి కేఆర్‌కేకు ప్రాణహాని ఉందని అతడి కుమారుడు ఫైసల్ కమాల్ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కేఆర్​కే బెయిల్​పై విడుదలయ్యాడు.

ఇక గతంలో ఎన్నో సినిమాలపై విమర్శలు చేసిన కేఆర్‌కే ఈ ఏడాది భారీ విజయాలు సాధించిన కేజీఎఫ్-2, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమాలను సైతం చెత్త సినిమాలంటూ వ్యాఖ్యానించాడు. ఆ సినిమాలు తీసిన డైరెక్టర్లను జైలులో పెట్టాలని తన రివ్యూల ద్వారా విమర్శించాడు. కేఆర్‌కే దేశ్‌ద్రోహి, ఏక్‌విలన్‌ రిటర్న్స్‌ సినిమాల్లోనూ నటించాడు.

ఇదీ చూడండి: చిరంజీవి సినిమాపై సీనియర్ డైరెక్టర్​ కామెంట్స్​.. ఏంటంటే?

Last Updated : Sep 13, 2022, 3:31 PM IST

ABOUT THE AUTHOR

...view details