తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అనుష్క పోషించిన ఆ పాత్ర చేయాలని ఉంది: కృతిశెట్టి

Kritishetty Nithin Macharla niyojakavargam: తన డ్రీమ్​ రోల్​ ఎంటో చెప్పింది యువ హీరోయిన్​ కృతిశెట్టి. హీరో నితిన్​పై తనకున్న అభిప్రాయాన్ని తెలిపింది. అలానే ఆయనతో కలిసి నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా గురించి పలు విశేషాలను తెలిపింది.

kritishetty
కృతిశెట్టి

By

Published : Aug 6, 2022, 6:13 PM IST

Updated : Aug 6, 2022, 6:58 PM IST

కృతిశెట్టి ఇంటర్వ్యూ

Kritishetty Nithin Macharla niyojakavargam: 'బాహుబలి'లో అనుష్కశెట్టి పోషించిన దేవసేన లాంటి పాత్రల్లో నటించాలని ఉందని యువ కథానాయిక కృతిశెట్టి తన మనసులోని మాటను బయటపెట్టింది. యువరాణి లాంటి పాత్రలకు తాను చక్కగా సరిపోతానని తెలిపింది. హీరో నితిన్​తో కలిసి మాచర్ల నియోజకవర్గం చిత్రంలో ఆమె నటించింది. ఆ మూవీ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా ముచ్చటించిన కృతిశెట్టి... ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకే నిర్మాతలు సినిమాలు తీస్తున్నారని, అలాంటి వారిని బతికించేందుకు తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలను ఆదరించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే తన తదుపరి సినిమాలో పోరాట సన్నివేశాల కోసం ఫైట్స్​లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపింది. త్వరలోనే ఓ స్వచ్చంద సంస్థను మొదలుపెడతానని వెల్లడించింది. ఇంకా ఏ విషయాలు చెప్పిందంటే..

నితిన్​తో పని చేయడం ఎలా అనిపించింది ?

నితిన్ నాకు మంచి స్నేహితుడయ్యాడు. ఆయన చాలా నిజాయితీ గల వ్యక్తి. ఆయనలో అమాయకత్వం కూడా వుంది. ఇరవై ఏళ్ళుగా ఆయన ఇండస్ట్రీలో వున్నారు. జయం సినిమాలో ఎలా వున్నారో.. ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఆయన అంతే ఫ్రెష్​గా వున్నారు. ఆయన నిజాయితీ, అమాకత్వం వలనే ఇది సాధ్యమైయిందని భావిస్తాను.

మాచర్ల నియోజక వర్గం కథ ఎలా ఉండబోతుంది ?
|మంచి కథ. పొలిటికల్ టచ్​తో పాటు మంచి సాంగ్స్, కామెడీ, యాక్షన్ అన్నీ మంచి ప్యాకేజీగా వుంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్​టైనర్​ సినిమా. ఫ్యామిలీస్ అంతా థియేటర్​కి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇక నా పాత్ర పేరు స్వాతి. సింపుల్, ఇనోసెంట్​గా ఉంటుంది. అలాగే స్వాతి పాత్రలో చాలా షేడ్స్ వుంటాయి. సీన్​ ఆధారంగా ఒక్కో షేడ్ బయటికి వస్తుంది. నా పాత్ర చాలా అందంగా వుంటుంది. కథలో నా పాత్రకు చాలా ప్రాధాన్యత వుంటుంది.

ఉప్పెన తర్వాత మళ్ళీ అలాంటి బలమైన పాత్ర చేయలేదనే ఆలోచన వస్తుంటుందా?
ఒక నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంటుంది. నాలో వెర్సటాలిటీ నిరూపించుకొని, మంచి ఎంటర్​టైనర్​గా అవ్వాలని ఉంటుంది. అందుకే ఉప్పెన తర్వాత వెంటనే శ్యామ్ సింగరాయ్ లో పూర్తిగా భిన్నంగా వుండే పాత్ర చేశాను. ఉప్పెన తర్వాత బ్యాలెన్స్ చేసుకొని ప్రాజెక్ట్స్ సైన్ చేశాను. అయితే వరుసగా కమర్షియల్ సినిమాలు విడుదలౌతున్నాయి. ఇంద్రగంటి, సూర్య చిత్రాలలో భిన్నంగా కనిపిస్తా. కొత్త కథల విషయంలో కూడా కొంచెం సెలక్టివ్​గా ఉంటున్నా.
మాచర్లలో షూటింగ్ అనుభవం ఎలా ఉంది ?
మాచర్ల సెట్​కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ గారు చాలా మంది నటీనటులు వున్నారు. అందరూ నన్ను ఎంతో ఇష్టంగా చూసుకున్నారు. అందరికంటే నేనే చిన్నదాన్ని. వారు మాట్లాడే విధానంలో నాపై చాలా ప్రేమ వుందని అర్ధమౌతుంటుంది. చాలా మంది నాకు ఫుడ్, స్వీట్స్ పంపించారు. వారు చూపిన ప్రేమకి ధన్యవాదాలు.

లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసే ఆలోచన వచ్చిందా ?
ఇప్పటికి ఆ ఆలోచన లేదు. అది చాలా భాద్యతతో కూడుకున్న అంశం. దర్శక నిర్మాతలు బలమైన నమ్మకం కలిగించినపుడు దాని గురించి ఆలోచిస్తాను.
బాలీవుడ్ అవకాశాలు వచ్చాయా ?
వచ్చాయి. కానీ చేసే ఆలోచన లేదు. తెలుగు, తమిళ్ పరిశ్రమల్లో మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ సినిమాలు చేయడమే నాకు ఆనందాన్ని ఇస్తుంది.
సినిమాలు కాకుండా వేరే లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ?
నాకు చిన్నప్పటి నుండి ఎన్జీవో స్టార్ట్ చేయాలనీ వుండేది. త్వరలోనే మొదలుపెడతానని అనుకుంటున్నాను.

ఇదీ చూడండి: Kriti Shetty: 'అది తింటే.. నా మూడ్​ ఇట్టే మారిపోతుంది'

Last Updated : Aug 6, 2022, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details