టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు హీరో ప్రభాస్. ఈయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అటు అభిమానులు ఇటు సినీ సెలబ్రిటీలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే డార్లింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడంటూ పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో హీరోయిన్ కృతిసనన్ ఓకరు. అయితే తాజాగా ఈ ప్రచారానికి కృతి ఇంకాస్త మసాలా యాడ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రభాస్‌తో పెళ్లి.. ఎట్టకేలకు నిజం ఒప్పేసుకుందిగా కృతిసనన్! - ప్రభాస్‌పై కృతిసనన్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్ కృతిసనన్. ఇప్పటికే ఆయనతో ఈ భామ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతోందని ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా డార్లింగ్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టింది.
'ఆదిపురుష్' షూటింగ్ సమయంలో హీరోయిన్ కృతిసనన్.. హీరో ప్రభాస్ దగ్గరయ్యారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. గతంలో 'కాఫీ విత్ కరణ్' షోకి వచ్చిన కృతి.. ప్రభాస్‌కు ఫోన్ చేసి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. అలానే 'ఆదిపురుష్' టీజర్ లాంచ్ ఈవెంట్లోనూ ప్రభాస్-కృతిసనన్ జోడీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఆ వీడియోలు, ఫొటోలు అప్పట్లో తెగ వైరలయ్యాయి.
ఇక తాజాగా భేడియా(తెలుగులో తోడేలు) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కృతి.. ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ప్రభాస్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ముగ్గురిలో ఎవరితో ఫ్లర్ట్ చేస్తావ్, ఎవరిని పెళ్లి చేసుకుంటావ్, ఎవరితో డేట్ చేస్తావ్ అని యాంకర్ మూడు ఆప్షన్స్ ఇవ్వగా.. కార్తీక్ ఆర్యన్‌తో ఫ్లర్టింగ్, టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ అని చెప్పి, ఛాన్స్ వస్తే ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని కృతి చెప్పింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. నార్త్ వదిన కన్ఫర్మ్ అయిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.