ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'ఆదిపురుష్'. ఓం రౌత్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియుల్ని అది నిరాశకు గురి చేసింది. తాజాగా ఈ మూవీ హీరోయిన్ కృతి సనన్ సినిమా పై పలు ఆసక్తికర కామెంట్లు చేసింది.
'ఆదిపురుష్'పై కృతి ఆసక్తికర కామెంట్స్.. ఇదో అద్భుతమైన అవకాశమంటూ.. - ఆదిపురుష్ వార్తలు
'ఆదిపురుష్'సినిమా పై పలు ఆసక్తికర కామెంట్లు చేసింది హీరోయిన్ కృతి సనన్. ఏమందంటే?
'ఈ సినిమా తీస్తున్నందుకు నేను మాత్రమే కాదు మా టీమ్ అందరం కూడా ఎంతో గర్వంగా ఉన్నాం. కొంతమంది ఆ సినిమాని ట్రోల్ చేస్తున్నారు. కేవలం 1.35 నిమిషాల టీజర్‌ను చూసి సినిమా మొత్తాన్ని అంచనా వేయకూడదు. మన పురాణాలు, చరిత్రకు సంబంధించిన కథలను ప్రపంచానికి తెలియజేయడానికి ఇదో అద్భుతమైన అవకాశం. సినిమాను చాలా గ్రాండ్ విజువల్స్‌తో సిద్ధంచేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా మెరుగ్గా చూపించడానికి వర్క్ చేస్తున్నారు' అని కృతి సనన్ తెలిపింది.
ఇక ఇటీవల ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జూన్16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.