తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్​తో పెళ్లి!.. క్లారిటీ ఇచ్చిన కృతి.. డేట్ ప్రకటించక ముందే అంటూ పోస్ట్!! - ప్రభాస్​ కృతి లవ్​

పాన్ఇండియా స్టార్​ ప్రభాస్​తో హాట్​ బ్యూటీ కృతి సనన్​ ప్రేమలో మునిగితేలుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉండడంతో కృతి ఎట్టకేలకు స్పందించింది. ఇన్​స్టాలో పోస్ట్​ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమందంటే?

Prabhas Kriti Sanon Love
Prabhas Kriti Sanon Love

By

Published : Nov 30, 2022, 9:30 AM IST

Updated : Nov 30, 2022, 9:56 AM IST

Prabhas Kriti Sanon Love: ఎలా మొదలైందో ఎక్కడ మొదలైందో తెలీదు కానీ కృతి సనన్, ప్రభాస్ ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు అటు బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్​గా మారింది. ఒకరకంగా చెప్పాలంటే కరణ్ జోహార్ షో ద్వారా ఇది ప్రారంభమైందని చెప్పొచ్చు. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కృతి సనన్ జంటగా నటించారు. ప్రభాస్ రాఘవ అనే పాత్రలో నటించగా ఆయన సరసన సీత పాత్రలో కృతి సనన్ నటించింది.

తర్వాత కరణ్ జోహార్ షో లో కృతి సనన్ పాల్గొన్నప్పుడు ఏ సమయంలో అయినా నీ ఫోన్ లిఫ్ట్ చేసే ఒక సెలబ్రిటీకి ఫోన్ చేయమని ఆయన కోరడంతో కృతి ప్రభాస్​కు ఫోన్ చేసింది. కొన్ని రింగ్స్​కే ప్రభాస్ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయడంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే వార్త బలంగా మొదలైంది. ఇక ఇటీవల భేడియా సినిమాతో కృతి సనన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాను మరింత ప్రమోట్ చేసుకునే పనిలో భాగంగా ఒక షోలో పాల్గొంటే ఆ షోలో కూడా కరణ్ జోహార్.. వరుణ్ ధావన్​తో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేయించారు.

ఓ సందర్భంలో కృతి సనన్​ పేరు మరొకరి గుండెల్లో ఉందని వరుణ్​ అన్నారు. ఆయన ప్రస్తుతానికి ఇక్కడ లేరని దీపికతో కలిసి షూటింగ్​లో ఉన్నారని కామెంట్ చేశారు. అప్పుడు దీపికతో ప్రాజెక్ట్ కే షూటింగ్​లో ఉన్నది ప్రభాస్ కావడంతో ప్రభాస్ కృతి మధ్య ఏదో ఉందనే వార్త మరోసారి తెరమీదకు వచ్చింది.

ఇక కొందరైతే ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్​లో ఆమెకు ప్రపోజ్ చేశారని కూడా ప్రచారం చేస్తూ రావడంతో వీటికి పుల్ స్టాప్ పెట్టాలని కృతి సనన్ భావించింది. "ఇది ప్రేమ కాదు అలాగని పీఆర్ స్టంట్ కూడా కాదు, మా భేడియా అంటే వరుణ్ ధావన్ ఆ రియాలిటీ షోలో కాస్త కావాలని ఇలా మాట్లాడారు. ఆయన వ్యంగ్యం ఎక్కడికో దారితీసి అనేక రకాల ఊహాగానాలకు ఇప్పుడు తావిస్తోంది. ఏదో ఒక వెబ్​సైట్​ మా పెళ్లి తేదీ కూడా ప్రకటించక ముందే నేను ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇవన్నీ ఎలాంటి ఆధారాలు లేని వార్తలు మాత్రమే" అంటూ చెప్పుకొచ్చారు. ఇకనైనా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి మరి.

కృతి సనన్​ పోస్ట్​
Last Updated : Nov 30, 2022, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details