లెజెండరీ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కృష్ణను కడసారి చూసేందుకు వచ్చిన వేల మంది అభిమానులను చూసి, అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటోంది.
ఇటు కృష్ణ.. అటు మహేశ్.. సోషల్ మీడియాలో వీడియో ట్రెండింగ్ - తండ్రీ కొడుకుల వీడియోలు
కృష్ణ, మహేశ్‌బాబు సినిమాల్లో సారూప్యత కలిగిన సన్నివేశాలను కలుపుతూ ఎడిట్ చేసిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. తండ్రీ కొడుకులను ఒకేసారి మీరూ చూసేయండి.
కృష్ణ మహేశ్‌బాబు వీడియో
ఈ క్రమంలో ఓ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియా ట్రెండ్ అవుతోంది. కృష్ణ, మహేశ్‌బాబు సినిమాల్లో సారూప్యత కలిగిన సన్నివేశాలను కలిపి చేసిన ఎడిట్ అభిమానులను విశేషంగా అలరిస్తోంది. చివర్లో కృష్ణ గురించి మహేశ్ చెప్పిన మాటలు తండ్రిపై ఆయనకున్న అమితమైన ప్రేమను తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఆ ఆసక్తికర వీడియోను మీరూ చూసేయండి. తండ్రీ కొడుకులను ఒకేసారి చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదు.. అభిమానులు ఒకసారి చూస్తే తనివి తీరదేమో!