సూపర్‌స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ప్రభూత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కాసేపటి కిందటే ముగిశాయి. తమ అభిమాన హీరో కృష్ణను కడసారి చూసేందుకు దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది నగరానికి వచ్చారు. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళులర్పించాలని పడిగాపులు పడ్డారు. కొందరికి అవకాశం లభించగా మరికొందరు కృష్ణ పార్థివ దేహాన్ని చూడలేకపోయారు.
బాధలోనూ ఫ్యాన్స్‌పై ప్రేమ చూపించిన మహేశ్ - బాధలోనూ ఫ్యాన్స్‌పై ప్రేమ చూపించిన మహేశ్
తమ అభిమాన నటుడు కృష్ణను కడసారి చూసేందుకు దూర ప్రాంతాల నుంచి అభిమానులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా మహేశ్ బాబు తగిన ఏర్పాట్లు చేశారు. ఎవరూ ఖాళీ కడుపుతో వెళ్లకూడదని మహేశ్‌బాబు అందరికీ భోజనం ఏర్పాటు చేశారు.
బాధలోనూ ఫ్యాన్స్‌పై ప్రేమ చూపించిన మహేశ్
అభిమానులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా మహేశ్‌బాబు తగిన ఏర్పాట్లు చేశారంటూ పలువురు పేర్కొన్నారు. "మా హీరోని చివరి చూపు చూసేందుకు ఇక్కడికి వచ్చాం. వచ్చిన వారెవరూ ఖాళీ కడుపుతో వెళ్లకూడదని మహేశ్‌బాబు అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. ఆయన విషాదంలో ఉన్నా మా ఆకలి తీర్చారు" అంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చూడండి:నటశేఖరుడికి ఇక సెలవు.. అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్