Kotabommali PS Teaser : ఆంధ్రప్రదేశ్ శ్రీకాకులం జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం 'కోట బొమ్మాళి పీఎస్'. డైరెక్టర్ తేజ మార్ని తెరకెక్కించిన ఈ సినిమాలో.. హీరో శ్రీకాంత్, నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జీ ఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ రూపొందిస్తున్నారు. అయితే సోమవారం మూవీయూనిట్.. ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. సస్పెన్స్ అండ్ థ్రిల్లర్‌గా ఉన్న టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరి మీరు టీజర్ చూశారా.
టీజర్లో ఏముంది? సినిమాలో హీరో శ్రీకాంత్ పాత్ర పేరు రామకృష్ణ. అయితే రామకృష్ణ కోట బొమ్మాళి గ్రామ పోలీస్ స్టేషన్లో ఓ కానిస్టేబుల్‌గా పనిచేస్తారు. తాను చేయని తప్పుకు కానిస్టేబుల్ రామకృష్ణ.. కేసులో ఇరుక్కొని తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు టీజర్లో చూపించారు. అయితే రామకృష్ణ కేసు ఓ రాజకీయ నాయకుడి భవిష్యత్‌పై ఆధారపడినట్లు కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నత స్థాయి పోలీస్ అధికారి. రామకృష్ణ కేసు ఛేదించేందుకు ఆమె స్వయంగా రంగంలోకి దిగుతుంది. ఆమెపై రాజకీయ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంటుంది. మరి రామకృష్ణ ఆ కేసు నుంచి ఎలా బయటపడతాడు? చివరికి ఆ పొలిటిషియన్ పరిస్థితేంటి? ఇవన్నీ తెలియాలంటే సినిమా విడుదల దాకా ఆగాల్సిందే. అయితే సస్పెన్స్ థ్రిల్లర్, పొలిటికల్ మిక్స్ ఉండడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇక టీజర్ మధ్యలో 'గన్ కన్నా పెన్ ఫోన్ బాగా పేలుతుంది సార్', 'గన్ గవర్నమెంట్‌ది వేలు మాత్రమే మనది' డైలాగులు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
Kotabommali PS Movie Cast :ఈ సినిమాలో హీరో రాజశేఖర్ కుమార్తె శివాణి రాజశేఖర్, నటుడు మురళీ శర్మ, రాహుల్ విజయ్, విష్ణు, దయానంద్ రెడ్డి, రామారావ్ జాదవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మిథున్ ముకుందన్, రంజిన్ రాజ్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. జగదీశ్ చీకటి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా నవంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.