తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దివ్యాంగుడి పాత్రలో ఎన్టీఆర్!​.. బీస్ట్'​ తెలుగు ట్రైలర్​ వచ్చేసింది! - beast movie UPDATE

కొరటాల శివతో చేయనున్న తర్వాతి సినిమాలో జూనియర్​ ఎన్టీఆర్​ ఆసక్తికర పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అందులో ఎన్టీఆర్.. వికలాంగుడి పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళ సూపర్​స్టార్ విజయ్ నటించిన 'బీస్ట్'​ తెలుగు ట్రైలర్​ను విడుదలైంది.

updates
మూవీ అప్డేట్స్​

By

Published : Apr 5, 2022, 5:07 PM IST

Updated : Apr 5, 2022, 10:48 PM IST

తమిళ సూపర్​స్టార్ విజయ్ నటించిన 'బీస్ట్'​ తెలుగు ట్రైలర్​ను విడుదలైంది. విజయ్​ పవర్​ ప్యాక్డ్​తో ట్రైలర్​లో అదరగొట్టాడు. దీంతో తెలుగులోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజైన తమిళ ట్రైలర్​ రికార్డు వ్యూస్​తో దూసుకుపోతూ.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. నెల్సన్​ దిలీప్​ కుమార్​ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సన్​పిక్చర్స్​ నిర్మించింది. అనిరుధ్​ రవిచందర్​ సంగీతం అందించారు. పూజా హెగ్డే హీరోయిన్​. ఏప్రిల్‌ 13న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

దివ్యాంగుడి పాత్రలో..

ఆర్​ఆర్​ఆర్​ సినిమా సక్సెస్​తో విజయోత్సాహంలో ఉన్న జూనియర్​ ఎన్టీఆర్​.. తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించే పనిలో నిమగ్నయ్యాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్​ తర్వాతి సినిమా చేయనున్నారు. అయితే ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్​..​ దివ్యాంగుడి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విభిన్న పాత్రలో ఎన్టీఆర్​ను.. కొరటాల చూపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కొరటాల- ఎన్టీఆర్ కాంబినేషన్​లో వచ్చిని జనతా గ్యారేజ్​ భారీ విజయాన్ని నమోదు చేసింది.

Last Updated : Apr 5, 2022, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details