తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇటు సూర్య.. అటు ధనుశ్​.. వెట్రిమారన్​ మాస్టర్​ ప్లాన్​! - సూర్య వాడి వాసల్​ మూవీ

తమిళ దర్శకుడు వెట్రిమారన్​ ప్రస్తుతం రీసెంట్ హిట్​ 'విడుదల పార్ట్​ 1' సినిమా సీక్వెల్​ను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ ప్రెస్​ మీట్​లో విలేకరులతో ముచ్చటించిన ఆయన సూర్య, ధనుశ్​తో చిత్రీకరించనున్న పలు ప్రాజెక్ట్​ల విశేషాలను పంచుకున్నారు. అవేంటంటే..

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 27, 2023, 6:53 AM IST

Vetrimaaran Movies List : ఈ ఏడాది విడుదలైన 'విడుతలై: పార్ట్‌ 1'తో అటు కోలీవుడ్​తో పాటు ఇటు టాలీవుడ్​లో మంచి క్రేజ్​ సంపాదించుకున్నారు తమిళ దర్శకుడు వెట్రిమారన్​. ఈ సినిమాకు తెలుగునాట మంచి హిట్​ టాక్ రాగా.. ప్రస్తుతం ఆయన దానికి కొనసాగింపు సినిమాను చిత్రీకరించే పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. అయితే సూర్య హీరోగా 'వాడి వాసల్‌' అనే సినిమాను 2021లో ప్రకటించారు. కానీ.. కొవిడ్‌ కారణంగా ఆ మూవీ చిత్రీకరణ గతేడాది ప్రారంభమైంది. ఇక ఆ తర్వాత, షూటింగ్‌ ఎంత వరకు పూర్తయింది? ఎప్పుడు రిలీజ్‌ అవుతుంది? తదితర వివరాలేవీ మూవీటీమ్​ పంచుకోలేదు. ఈ క్రమంలో చెన్నైలో సోమవారం నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో వెట్రిమారన్​ విలేకరులతో ముచ్చటించారు. 'వాడి వాసల్‌' మూవీ అప్డేట్​తో పాటు ధనుశ్​ హీరోగా తెరకెక్కనున్న ఓ హిట్‌ సినిమా సీక్వెల్‌ గురించి ఆయన ఈ ప్రెస్​ మీట్​లో ప్రస్తావించారు.

Viduthalai Part 2 Shooting: 'విడుతలై: పార్ట్‌ 2' సినిమా చిత్రీకరణ పూర్తి కాగానే 'వాడి వాసల్‌' షూటింగ్​ను పునః ప్రారంభించనున్నట్టు వెట్రిమారన్​ పేర్కొన్నారు. జల్లికట్టు నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని ఎద్దు సన్నివేశాల కోసం లండన్‌లో ఇప్పటికే సీజీ పనులు మొదలయ్యాయని ఆయన తెలిపారు. ఇక ధనుశ్​ లీడ్​ రోల్​లో వెట్రిమారన్​ గతంలో తెరకెక్కించిన 'వడ చెన్నై' తమిళ నాట హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఓకే చేసిన సినిమాలన్నీ పూర్తయ్యాక 'వడ చెన్నై'కి సీక్వెల్​ను తెరకెక్కించే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. మరోవైపు, దళపతి విజయ్​తో కలిసి ఓ సినిమా చేసేందుకు చర్చలు సాగుతున్నాయని ఆయన తెలిపారు. 'విడుదల' ప్రమోషన్స్​లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన వెట్రి మారన్‌.. టాలీవుడ్‌ ప్రముఖ హీరో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయనున్న విషయంపై స్పందించారు.

Ntr Vetrimaaran Movie : "ఆయనతో ఓ సినిమా చేసే అవకాశం ఉంది. కానీ, అందుకు చాలా సమయం పడుతుంది. అది సోలో హీరో మూవీనా లేక మల్టీస్టారరా? అనే విషయం కాలమే సమాధానం చెబుతుంది. అలాగే, ఏ కాంబినేషన్‌లో ఎలాంటి మూవీ రావాలన్న దానిపై నాకు స్పష్టత ఉంది. స్టార్‌ వాల్యూ, కాంబినేషన్‌ వాల్యూ కాకుండా మేము ఎంచుకునే కంటెంట్‌ ఫలానా స్టార్‌ కావాలని డిమాండ్‌ చేస్తే అతనితో సినిమా చేస్తాను" అని వెట్రిమారన్‌ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details