తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Vimanam Trailer : అనసూయ 'విమానం'.. కంటతడి పెట్టిస్తున్న ట్రైలర్! - అనసూయ విమానం మూవీ ట్రైలర్​

కోలీవుడ్​ డైరెక్టర్​ సముద్రఖని లేటెస్ట్​గా 'విమానం' అనే సినిమాలో లీడ్​ రోల్​లో మెరిశారు. ఈ సినిమాలో టాలీవుడ్​ బ్యూటీ అనసూయతో పాటు మరికొందరు కీలక పాత్ర పోషించారు. దీనికి సంబంధించిన ట్రైలర్​ ఇటీవలే రిలీజైంది. భావోద్వేగభరితంగా ఉన్న ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటోంది. ఇంతకీ మీరు చూశారా?

Vimanam Movie Trailer
irector samudrakhani and heroine anasuya new movie

By

Published : Jun 1, 2023, 3:26 PM IST

Updated : Jun 1, 2023, 4:12 PM IST

Vimanam Movie Trailer : 'బ్రో' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న కోలీవుడ్​ డైరెక్టర్​ సముద్రఖని లేటెస్ట్​గా 'విమానం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విమానం ఎక్కాలన్న తన కొడుకు కలను.. పేద దివ్యాంగుడైన ఓ తండ్రి ఎలా నెరవేర్చాడనే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన తండ్రి పాత్రలో నటించారు. టాలీవుడ్​ నటి​ అనసూయ, మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్ , రాహుల్‌ రామకృష్ణ లాంటి కీలక నటులు ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించారు.

Director Samuthirakani Movie : శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం రిలీజైన ఈ ట్రైలర్‌ ప్రేక్షకులన చేత కంటతడి పెట్టిస్తోంది. సముద్రఖనితో పాటు అనసూయ ఇతర స్టార్స్​ యాక్టింగ్ బాగుందంటూ ట్రైలర్​ చూసిన ఆడియెన్స్​ అభిప్రాయపడుతున్నారు. భావోద్వేగభరితంగా ఉన్న ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది.

ట్రైలర్​ ఏంటంటే?
Vimanam Trailer : బస్తీలో నివసించే ఓ తండ్రి నిత్యం తన కొడుకు గురించే ఆలోచిస్తుంటాడు. ప్రతి పనిలోనూ తన బిడ్డ బాగుండాలనే ఆకాంక్షిస్తుంటాడు. ఎప్పుడూ విమానం గురించి మాట్లాడే ఆ కొడుక్కి దాన్ని ఎక్కాలనే కోరిక పుడుతుంది. ఆ విషయం తెలుసుకున్న తండ్రి (సముద్రఖని) ఎలాగైనా సరే తన బిడ్డను విమానం ఎక్కించి తీరాలని ప్రయత్నిస్తుంటాడు. అందుకు అతనికి రూ.10 వేలు డబ్బు అవసరం అవుతుంది. దీంతో ఆ సొమ్మును సంపాదించేందుకు రాత్రి పగలు కష్టపడుతుంటాడు.

Vimanam Cast : కానీ చివరికి ఓ రోజు రాత్రి సముద్రఖని ఏడుస్తూ తన కొడుకుకు కనిపిస్తాడు. దీంతో ఆ బాబు ఎమోషనలై.. 'ఇక నేను విమానం ఎక్కను నాన్న' అని అంటాడు. అయితే తండ్రి మాత్రం తన కొడుకును ఎలాగైనా విమానం ఎక్కించాలని అనుకుంటాడు. ఇంతకీ ఆ కొడుకు కోరికను తండ్రి తీర్చాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక వేశ్య పాత్రలో నటించిన అనసూయ.. చెప్పులు కుట్టుకునే రాహుల్ రామకృష్ణ లవ్ స్టోరీ కూడా ఆసక్తికరంగా ఉంది.

గురువారం రిలీజైన ఈ ట్రైలర్​లో తండ్రీకొడుకుల మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎమోషన్ సీన్స్ తో కంటతడి పెట్టిస్తున్నాయి. దీంతో అభిమానులకు ఈ సినిమాపై ఆసక్తి ఇంతకింత పెరిగిపోయింది. భావోద్వేగాలతో పాటు సగటు వ్యక్తుల ప్రయాణాన్ని వెండితెరపై చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు శివ ప్రసాద్​. కాగా జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

Last Updated : Jun 1, 2023, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details