తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్​ అట్లీ - కోలీవుడ్ డైరెక్టర్​ అట్లీ భార్య ప్రెగ్నెంట్​

కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ తీపికబురు చెప్పారు. తన భార్య ప్రియ తల్లి కానుందని తెలిపారు.

Atlee wife pregnant
తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్​ అట్లీ

By

Published : Dec 16, 2022, 4:44 PM IST

కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ శుభవార్త చెప్పారు. తన భార్య ప్రియ తల్లి కానుందని వెల్లడించారు. బేబీ బంప్‌తో ఉన్న ప్రియ ఫొటోలు షేర్‌ చేసిన ఆయన.. "మా కుటుంబం పెద్దది అవుతోంది. ఈ శుభవార్తను మీతో పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి" అని అట్లీ పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా, ప్రియ నటిగా కొన్ని ధారావాహికల్లో నటించారు. స్నేహితుల ద్వారా పరిచయమైన వీరిద్దరూ కొంతకాలానికే ప్రేమలో పడ్డారు. కుటుంబసభ్యుల అంగీకారంతో 2014లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

సినిమాల విషయానికి వస్తే.. 'రాజా రాణి'తో అట్లీ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. మొదటిసినిమాతోనే ఆయన సక్సెస్‌ అందుకున్నారు. అనంతరం ఆయన తెరకెక్కించిన 'తేరి', 'మెర్సల్‌', 'బిగిల్‌' మంచి విజయాలు అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన షారుఖ్‌ ఖాన్‌తో 'జవాన్‌' చేస్తున్నారు. నయనతార కథానాయిక.

ఇదీ చూడండి:'అవతార్​ 2' హంగామా.. థియేటర్​పై దాడి!

ABOUT THE AUTHOR

...view details