Koffee With Karan Season 7: బాలీవుడ్ దర్శక- నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' అనే సెలబ్రిటీ టాక్ షోలో 'లాల్ సింగ్ చడ్డా' సినిమా నాయకానాయికలు ఆమిర్‌ఖాన్, కరీనా కపూర్ పాల్గొన్నారు. ఈ వేదికపై ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకోవడంతోపాటు కరణ్‌ను ఓ ఆట ఆడుకున్నారు. 'పిల్లలు పుట్టాక క్వాలిటీ సెక్స్ అనేది కల్పితమా? వాస్తవమా?' అని కరణ్ ప్రశ్నించగా 'మీకు తెలియదా?' అంటూ కరీనా కపూర్ తిప్పికొట్టారు.
సెక్స్ గురించి కరణ్ ప్రశ్న.. నటి దీటైన రిప్లై.. పంచ్‌లతో ఆమిర్ సందడి - koffee with karan season 7 next episode
కాఫీ విత్ కరణ్ షోకు విచ్చేసిన ఆమిర్ ఖాన్, కరీనా కపూర్.. కరణ్‌ను ఓ ఆట ఆడుకున్నారు. పంచ్‌లు, సెటైర్లు వేస్తూ ఆద్యంతం సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. మీరూ ఓసారి చూసేయండి..
దాంతో 'మా అమ్మ ఈ షో చూస్తారు. ఇలా నా సెక్స్ లైఫ్ గురించి మాట్లాడటం బాగుండదేమో' అని కరణ్ బదులిచ్చారు. వెంటనే ఆమిర్ స్పందిస్తూ 'మీరు ఇతరుల లైంగిక జీవితం గురించి మాట్లాడటాన్ని మీ మదర్ పట్టించుకోరా?' అని నవ్వులు పంచారు. అనంతరం, 'నా ఫ్యాషన్ సెన్స్‌కు ఎంత రేటింగ్ ఇస్తావ్' అని ఆమిర్ అడగ్గా 'మైనస్' అంటూ కరీనా పంచ్ విసిరి, నవ్వుల వర్షం కురిపించారు. సంబంధిత ప్రోమో నెట్టింట సందడి చేస్తోంది.
హాలీవుడ్ చిత్రం 'ఫారెస్ట్ గంప్' రీమేక్‌గా తెరకెక్కింది 'లాల్‌సింగ్ చడ్డా'. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నాగ చైతన్య కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నటుడు చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ కామెడీ డ్రామా మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. 6 సీజన్లపాటు బుల్లితెర వేదికగా అలరించిన 'కాఫీ విత్ కరణ్' షో తాజా సీజన్ ఓటీటీ 'డిస్నీ+ హాట్‌స్టార్'లో ప్రసారమవుతోంది.