కృష్ణకుమార్ కున్నత్ అలియాస్ కేకే (53).. గాయకుడిగా ఎన్నో ఏళ్లపాటు సినీ ప్రియుల హృదయాలను ఏలిన ఆయన మంగళవారం రాత్రి హఠాన్మరణం చెందారు. హిందీలో ఎన్నో పాటలు పాడి స్టార్ సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, అస్సాం, గుజరాతీ.. ఇలా పలు భాషల్లో మనసుని హత్తుకునేలా, యువతను ఉర్రూతలూగించేలా పాటలు పాడారు.
kk songs: 'కేకే' పాటలు తెలుగులోనూ సూపర్‌హిట్టే - Krishnakumar Kunnath news
ప్రముఖ హిందీ గాయకుడు కేకే హఠాన్మరణం సంగీత లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన తెలుగులో కూడా ఎన్నో పాటలు పాడారు. దాదాపు అవన్నీ సూపర్ హిట్స్‌గా నిలిచాయి.
ఇక, తెలుగులో అయితే ఆయన పాడిన ఎన్నో పాటలు సూపర్‌హిట్స్ అందుకున్నాయి. 'కాలేజీ స్టైలే', 'ఒకరికి ఒకరై ఉంటుంటే', 'ఏ మేరా జహా', 'దేవుడే దిగివచ్చినా', 'దాయి దాయి దామ్మా', 'చెలియా చెలియా', 'గుర్తు కొస్తున్నాయి', 'అవును నిజం', 'ఒక చిన్ని నవ్వే నవ్వి', 'ఉప్పెనంత ఈ ప్రేమకు', 'మై హార్ట్ ఈజ్ బీటింగ్', 'నీకోసమే ఈ అన్వేషణ', 'ఐయామ్ వెరీ సారీ', 'ఎవ్వరినెప్పుడు తన వలలో'.. ఇలా చెప్పుకొంటూ వెళితే కేకే ఆలపించిన ఎన్నో సూపర్ హిట్ పాటలు ఆయా హీరోల కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే ఆణిముత్యాలయ్యాయి. కేకే ఆకస్మిక మరణంతో సినీ సంగీత లోకం మూగబోయిన వేళ.. ఆయన ఆలపించిన తెలుగు సూపర్ హిట్స్‌ని ఓసారి గుర్తు చేసుకుందాం..!
ఇదీ చదవండి:SINGER KK: ప్రముఖ సింగర్ కేకే హఠాన్మరణం.. ప్రధాని సంతాపం