తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కాస్ట్​లీ కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత'.. అసలు సీక్రెట్ చెప్పేసిన పూజా హెగ్డే - కిసీ కా భాయ్​ కిసీకీ జాన్​ మూవీ ప్రమోషన్స్​లో పూజ

టాలీవుడ్​ హీరోయిన్​ పూజా హెగ్డే ఇటీవల సోషల్​ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్​పై స్పందించింది. తన అప్​కమింగ్​ సినిమా 'కిసీకా భాయ్​ కిసీకీ జాన్'​ ప్రమోషన్లలో పాల్గొన్న పూజ.. ఆ విషయాలపై క్లారిటీ ఇచ్చింది.

pooja hegde
pooja hegde

By

Published : Apr 16, 2023, 1:04 PM IST

తనపై వచ్చిన రూమర్స్​ అన్నింటికీ ఒక్కొక్కటిగా చెక్​ పెట్టుకుంటూ వస్తోంది నటి పూజా హెగ్డే. ఇటీవలే ఆమె నటిస్తున్న ఓ సినిమా ప్రొడ్యూసర్​ తనకు ఓ కాస్ట్లీ కారు గిఫ్ట్​గా ఇచ్చారన్న వార్తపై ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. అవన్నీ పుకార్లని స్పష్టం చేసింది. ఇటీవలే తన డేటింగ్​ రూమర్స్​ను కొట్టిపారేసిన పూజ.. ఇప్పుడు వచ్చిన వార్తలో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది.

బాలీవుడ్​ హీరో హృతిక్​ రోషన్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన హిస్టరీ ఫిల్మ్​ 'మొహన్​జుదారో'తో బీటౌన్​కు పరిచయమయ్యింది పూజ. ఆ తర్వాత 'హౌస్​ఫుల్​ 4' సినిమాలోనూ నటించింది. అయితే ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలకే పరిమితమైన ఈ తార..​ 'చెన్నై ఎక్స్​ప్రెస్'​ ఫేమ్​ డైరెక్టర్​ రోహిత్​ శెట్టి తెరకెక్కించిన 'సర్కస్‌' అనే హిందీ చిత్రంతో బాలీవుడ్​లోకి మరోసారి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రణవీర్ సింగ్​ సరసన ఆమె నటించింది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్​ వద్ద నిరాశే మిగిలింది. దీంతో ఇక అవకాశాలు అందిపుచ్చుకోలేమని అనుకుంటున్న పూజను సల్మాన్​ సినిమా వరించింది.

తెలుగులో పవర్ స్టార్​ పవన్ కల్యాణ్​, శ్రుతి హాసన్​​ నటించిన 'కాటమరాయుడు' సినిమాకు రీమేక్​గా తెరకెక్కుతున్న 'కిసీకా భాయ్ కిసీకి జాన్'​ సినిమాలో నటించింది పూజా హెగ్డే. రంజాన్​ సందర్భంగా ఏప్రిల్​ 21న ఈ సినిమా రిలీజవ్వనుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో ఆమె బిజీ అయిపోయింది. ఓ వైపు ప్రమోషన్లలో పాల్గొంటూనే మరోవైపు ఫొటో షూట్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్​కు హాజరైన పూజ.. తనపై మీడియాలో వస్తున్న రూమర్స్​పై స్పందించింది.

"నా గురించి ఎప్పటికప్పుడు మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. నేను వాటన్నింటినీ చదువుతాను. వాటన్నింటికీ నేను సమాధానాలు ఇస్తూ కూర్చోలేను. అప్పుడప్పుడు నా తల్లిదండ్రులు కూడా నాకు ఆ వార్తల స్క్రీన్​ షాట్లు పంపించి.. ఇవన్నీ నిజమేనా అని అడుగుతుంటారు. రీసెంట్​గా నేను నటిస్తున్న ఓ సినిమా నిర్మాతలు నాకు కాస్ట్లీ కారు గిఫ్ట్​గా ఇచ్చారంటూ వార్తలు వచ్చాయి. నేను దాన్ని ఆ నిర్మాతకు పంపించి మీ సర్పైజ్​ నాశనమైంది అన్నాను. ఒక వేళ నా గురించి చెడుగా ప్రచారం చేయాలనుకుంటే నిజంగా నాకు కారు ఇవ్వండి" అంటూ చెప్పుకొచ్చింది.

గతంలోనూ తనపై వచ్చిన ఓ రూమర్​పై స్పందించింది పూజ. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్​తో ప్రేమలో ఉందంటూ వచ్చిన వార్తల గురించి ప్రస్తావించిన ఆమె.. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్‌పైనే ఉందని తెలిపింది. ప్రస్తుతం మహేశ్​ బాబు హీరోగా త్రివిక్రమ్​ తెరకెక్కిస్తున్న 'SSMB 28' సినిమా షూటింగ్​తో పాటు సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details