ఐపీఎస్ అధికారి అమిత్ లోధా కెరీర్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనేలా చేసిన సంఘటన గ్యాంగ్‌స్టర్ అశోక్ మహతోను పట్టుకోవడం. అత్యంత సాహోసేపతమైన ఆపరేషన్‌ను 'ఖాకీ: ది బిహార్ చాప్టర్' పేరుతో నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌గా తెరకెక్కించింది. గతవారం స్ట్రీమింగ్ మొదలైన ఈ వెబ్‌సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్-10లోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. అంతేకాదు, ఈ వెబ్‌సిరీస్ రచయిత నీరజ్ పాండే ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు చెబుతూ స్వదస్తూరితో రాసిన లేఖను పంచుకున్నారు.
అదరగొడుతున్న 'ఖాకీ: ది బిహార్ చాప్టర్' వెబ్‌సిరీస్.. గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్-10లోకి - ఖాకీ వెబ్ సిరీస్ టాప్ ట్రెండింగ్
గతవారం స్ట్రీమింగ్ మొదలైన 'ఖాకీ: ది బిహార్ చాప్టర్' వెబ్‌సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్-10లోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.
"ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఖాకీపై చూపిస్తున్న ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రేమ, సహకారం మరింత కష్టపడి పనిచేసేలా చేస్తుంది. మీ వల్లే మేము ఉన్నాం" అని పేర్కొన్నారు. నీరజ్ పాండే ట్వీట్‌కు పలువురు రిప్లై ఇస్తూ, సిరీస్ చాలా బాగుందని కితాబిచ్చారు. తర్వాతి చాప్టర్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ప్రకటించారు. భవ్ దులియా దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌లో పోలీస్ ఆఫీసర్ అమిత్ లోధాగా కరణ్ థాకర్ నటించారు. గ్యాంగ్‌స్టర్ అశోక్ మహతోగా అవినాష్ తివారి సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక అభిమన్యుసింగ్, రవికిషన్, అషుతోష్ రాణాలు తమదైన నటనతో మెప్పించారు.
ఇదీ చూడండి:అందుకే మహేశ్‌ను హీరోగా రాజమౌళి ఎంచుకున్నాడు: విజయేంద్ర ప్రసాద్