తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

యశ్ నోట బాలయ్య డైలాగ్.. 'కేజీఎఫ్-2' సక్సెస్​పై ఎమోషనల్! - కేజీఎఫ్

KGF Yash emotional video: కేజీఎఫ్-2 విజయంపై ఆ సినిమా నటుడు యశ్ ఎమోషనల్ అయ్యారు. సినిమాపై ప్రేమాభిమానాలు చూపుతున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్​లో వీడియో పోస్ట్ చేశారు.

KGF YASH EMOTIONAL
KGF YASH EMOTIONAL

By

Published : Apr 21, 2022, 8:05 PM IST

KGF Yash emotional video: కేజీఎఫ్-2 సినిమాతో పాన్ ఇండియా ఆడియన్స్​ను మరోసారి అలరించారు కన్నడ హీరో యశ్. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. గత చిత్రాల రికార్డులన్నీ చెరిపేస్తూ.. దూసుకెళ్తోంది. వీక్ డేస్​లోనూ భారీ కలెక్షన్లు రాబడుతూ సత్తా చాటుతోంది. ఈ విజయంతో హీరో యశ్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే అభిమానులు, మూవీ టీమ్​కు థ్యాంక్స్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. 'నా స్థానం మీ మనసు' అంటూ వీడియోలో పేర్కొన్నారు. కాగా, ఈ డైలాగ్ బాలయ్యను గుర్తు చేసేలా ఉందంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఆహాలో వచ్చే అన్​స్టాపబుల్ షోలో బాలయ్య ఈ డైలాగ్ వాడేవారని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, చిత్రంపై తాను పెట్టుకున్న నమ్మకాన్ని ఓ కథ రూపంలో చెప్పారు యశ్.

"ఓ గ్రామం చాలా రోజుల నుంచి కరవుతో అల్లాడుతోంది. వర్షాలు పడేలా ప్రార్థనలు చేసేందుకు ప్రజలంతా ఓ చోటికి చేరారు. కానీ ఓ బాలుడు మాత్రం గొడుగును వెంటతీసుకొని వెళ్లాడు. అందరూ అతడిని చూసి పిచ్చోడని అన్నారు. మరికొందరు అతి విశ్వాసం అంటూ ఎద్దేవా చేశారు. కానీ ఆ బాలుడిది అసలైన నమ్మకం. ప్రార్థనలు ఫలించి వర్షం పడుతుందన్న విశ్వాసంతో గొడుగుతో వెళ్లాడు. నేనూ అలాంటి బాలుడినే. ఆ విశ్వాసానికి సంబంధించిన ప్రతిఫలాన్ని నేను అనుభవిస్తున్నా. ఇప్పుడు థ్యాంక్యూ చెప్పడం చాలా చిన్న విషయం. కానీ చెప్పాలి. ప్రేమాభిమానాలు అందించిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నా. మీకు ఇంతకుముందే చెప్పా.. 'నా స్థానం మీ మనసు'" అంటూ చెప్పుకొచ్చాడు యశ్.

పాన్‌ ఇండియా సినిమాగా విడుదలైన కేజీఎఫ్-2 బాలీవుడ్‌లోనూ రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన వారం రోజుల్లో హిందీ వెర్షన్​లో ఏకంగా రూ.250కోట్లను సాధించి రికార్డు సృష్టించింది. బాలీవుడ్​లో అత్యంత వేగంగా రూ.250కోట్లు కొల్లగొట్టిన తొలి సినిమాగా నిలిచింది. అంతకుముందు విడుదలైన 'ఆర్​ఆర్​ఆర్​'కు హిందీ వెర్షన్​కు రూ.250కోట్లు సాధించడానికి దాదాపు మూడు వారాలు పట్టగా.. 'బాహుబలి 2'కు ఎనిమిది రోజులు, ఆమిర్​ ఖాన్​ 'దంగల్'​కు పది రోజులు పట్టింది.

ABOUT THE AUTHOR

...view details