తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కేజీయఫ్​ చాప్టర్​-2' టికెట్​ ధరల పెంపు- మహేశ్‌ ఫ్యాన్స్​కు ఇక పండగే! - mahesh babu new movie updates

కేజీయఫ్​ చాప్టర్​-2 సినిమా టికెట్ ధరలను మూడు రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే వరుస పెట్టి సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌లను ఇవ్వబోతున్నట్లు ‘సర్కారువారి పాట’చిత్ర బృందం తెలిపింది.

kgf
కేజీఎఫ్​

By

Published : Apr 12, 2022, 7:17 PM IST

తెలంగాణలో కేజీయఫ్​ చాప్టర్​-2 సినిమా టికెట్​ ధరలు పెరిగాయి. టికెట్ పై రూ.50 పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో మల్టీఫ్లెక్స్​లో టికెట్ రూ.50, సాధారణ థియేటర్లలో రూ.30 వరకు టికెట్​ ధరలు పెరగనున్నాయి. ఈ నెల14 నుంచి 17 వరకు పెరిగిన ధరలు అమల్లో ఉండనున్నాయి. టికెట్ ధరలు పెంచడంపై పలువురు థియేటర్ యాజమాన్యాల అసంతృప్తి చేశారు. ధరలు పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్ కు వచ్చే సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వరుస పెట్టి అప్‌డేట్లు..

సూపర్​స్టార్​ మహేశ్‌బాబు అభిమానులకు శుభవార్త. వరుస పెట్టి సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌లను ఇవ్వబోతున్నట్లు ‘సర్కారువారి పాట’చిత్ర బృందం తెలిపింది. మహేశ్‌ కథానాయకుడిగా పరుశురామ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తయింది. కేవలం ఒకే ఒక పాటను షూట్‌ చేయాల్సి ఉన్నట్లు తెలిపింది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, పోస్టర్స్‌తో పాటు, ‘కళావతి’సాంగ్‌కు విశేష క్రేజ్‌ వచ్చింది. ఇక వరుస అప్‌డేట్‌లు ఇవ్వనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. వేసవి కానుకగా మే12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇదీ చదవండి:'ఆచార్య' ట్రైలర్ వచ్చేసింది.. థియేటర్లలో మెగా అభిమానుల రచ్చ

ABOUT THE AUTHOR

...view details