Yash Brahmastra Sequel: 'కేజీఎఫ్ -2' సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయారు కన్నడ స్టార్ హీరో యశ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల్లో పలు రికార్డులను సైతం తిరగరాసింది. ఈ అద్వితీయ విజయం తర్వాత యశ్‌తో సినిమాలు చేసేందుకు పలువురు బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ముందుకు వస్తున్నారు.
బ్రహ్మాస్త్ర సీక్వెల్‌లో యశ్!.. మహాభారతం మూవీలో కర్ణుడిగా!! - బ్రహ్మస్త్ర బాలీవుడ్ సినిమా
'కేజీఎఫ్ 2' బ్లాక్‌బస్టర్ తర్వాత బాలీవుడ్ నుంచి కన్నడ హీరో యశ్‌కు భారీ ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా బ్రహ్మాస్త్ర సీక్వెల్‌తో పాటు ఓ పౌరాణిక సినిమాలో యశ్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు..
మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో కర్ణుడి పాత్ర కోసం యశ్‌ను రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా సంప్రదించారట. మరోవైపు, బ్రహ్మాస్త్ర సీక్వెల్‌లో దేవ్ పాత్రలో యశ్ కనిపించే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రణ్‌బీర్‌కపూర్‌తో సమానంగా సెకండ్ పార్ట్‌లో యశ్ క్యారెక్టర్ ఉంటుందని అంటున్నారు. వీటిలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.