'కేజీయఫ్'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. ప్రస్తుతం ఫ్యామిలీ టైమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. 'కేజీయఫ్-2' తర్వాత ఆయన ఇంకా కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించలేదు. దీంతో షూట్స్ లేకపోవడం వల్ల ఇంట్లోనే ఉండి తన ఇద్దరు పిల్లలతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. ఇందులో భాగంగానే యశ్ తాజాగా తన తనయుడు యథర్వ్ కలిసి ఓ సరదా వీడియో చేశారు. బ్రష్ చేయడం గురించి యశ్ మందలించడంతో కాస్త నొచ్చుకున్న యథర్వ్.. తన తల్లి రాధికా పండిత్‌ని హత్తుకుని.. 'డడ్డా ఈజ్ ఏ బ్యాడ్ బాయ్' అని చెబుతూ కనిపించాడు. దీంతో యశ్.. 'డాడా (నాన్న) ఈజ్ ఏ గుడ్ బాయ్' అనగా.. 'నో.. నాన్న బ్యాడ్ బాయ్. అమ్మ గుడ్ గర్ల్' అని సమాధానమిస్తాడు. ఈ సరదా వీడియోని రాధిక ఇన్‌స్టా వేదికగా షేర్ చేయగా.. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
Video Viral: హీరో యశ్‌పై ఫిర్యాదు!.. బ్యాడ్ గాయ్ అని ఏడుస్తూ.. - యశ్ కొత్త సినిమా
కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌కు సంబంధించిన సోషల్‌మీడియాలో ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. ఇందులో యశ్‌ను ఉద్దేశిస్తూ.. ఆయన బ్యాడ్ గాయ్ అని ఒకరు కన్నీరుపెట్టుకుంటూ చెప్పారు. ఇంతకీ అలా అన్నదెవరంటే?
కాగా, 'కేజీయఫ్ 2' తర్వాత హీరో యశ్ చేయబోయే సినిమాపై దేశవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ కేజీయఫ్ రెండో భాగం విడుదలై నెలలు గడుస్తున్నా ఆయన నుంచి ఇంకా ఎటువంటి సినిమా ప్రకటన రాలేదు. దీంతో ఆయన నెక్ట్స్ ఏ దర్శకుడితో చేయనున్నారు? ఎలాంటి ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారు? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే యశ్.. తన తదుపరి చిత్రాన్ని కన్నడ దర్శకుడు నార్తన్‌తో చేయబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. 'కేజీయఫ్ 2' కన్నా ముందుగానే దీనికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఆయనకు ఉన్న ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని నార్తన్ ఏడాదిన్నర నుంచి ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వర్క్ తుది దశకు చేరుకున్నట్లు టాక్. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుందని వార్తలు వస్తన్నాయి.
ఇదీ చూడండి: యశ్ నెక్ట్స్ మూవీ అనౌన్స్‌కు ప్లాన్.. దర్శకుడు అతడే.. హీరోయిన్ ఎవరంటే?