తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అందరి కళ్లు జనవరి 8పైనే.. KGF స్టార్​ యశ్​ కొత్త సినిమా అప్డేట్?​ - yash movies

'KGF' సినిమాతో పాన్​ ఇండియా గుర్తింపు సంపాందించుకున్నారు నటుడు యశ్​. 'కేజీయఫ్​ 2' కూడా విడుదలై బ్లాక్​బస్టర్​గా నిలిచింది. దీంతో యశ్​ తదుపరి చిత్రంపై అందరి ఆసక్తి నెలకొంది. అయితే యశ్​ కొత్త చిత్రం గురించి ఓ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

yash new movie
yash new movie

By

Published : Dec 25, 2022, 6:13 PM IST

'కేజీయఫ్‌'తో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయిన యశ్‌.. తర్వాతి సినిమా ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. చాలామంది చాలారకాలుగా ప్రయత్నిస్తున్నా.. ఆయన మాత్రం ఓపెన్‌ అవ్వడం లేదు. అయితే సినిమా వచ్చి ఆరు నెలలు దాటింది కదా.. ఇప్పుడైనా చెబుతాడేమో అనుకుంటే.. ఆసక్తికర సమాధానం చెప్పి దాటేశాడు.

'కేజీయఫ్‌ 2' విడుదలైన వెంటనే యశ్‌కు భారీ ఆఫర్లు వస్తాయి అని అనుకున్నారంతా. అనుకున్నట్లుగా వచ్చాయి. అయితే ఆయన ఏదో ఒకటి ఓకే చేసి ముందుకెళ్లాలి అనుకోలేదు. ఇప్పటికీ ఆయన సమాధానం అలానే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నా తర్వాతి సినిమా కోసం ఎదురుచూసే అభిమానులు కొంచెం ఓపిక పట్టాలి'' అంటూ తన పాత మాటే మళ్లీ చెప్పడం వల్ల అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు.

యశ్​

"మనం ఏదైనా విజయం సాధించినప్పుడు దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే దాని గురించి తెలుసుకుంటారు. ఒక రాజు ప్రజల దగ్గరకు వెళ్లి 'నేనే రాజును' అని చెబితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో.. మన విజయం గురించి మనం మాట్లాడినా అలానే ఉంటుంది. నా తర్వాతి సినిమాకు సంబంధించిన ప్రకటన కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. 'కేజీయఫ్‌' సిరీస్‌ సినిమాల సక్సెస్‌కు నేనూ ఆశ్చర్యపోయాను. కానీ.. నేను ఆ సినిమా ఇచ్చిన విజయాన్ని క్యాష్‌ చేసుకునే రకం కాదు. నిరంతరం నేర్చుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఏ పనినైనా ఎంత ఉత్సాహంగా ప్రారంభిస్తానో, అంతే ఉత్సాహంగా పూర్తి చేస్తాను. పని కోసం ఎంత పోరాటమైనా చేస్తాను"
- యశ్‌

జనవరి 8 కోసం అందరూ..
యశ్‌ కొత్త సినిమా ప్రకటన కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానుల చూపు ఇప్పుడు జనవరి 8 మీద పడింది. ఆ రోజు ఆయన పుట్టిన రోజు కావడం వల్ల.. అప్పుడైనా కొత్త సినిమా ప్రకటన ఉంటుందేమో అనుకుంటున్నారు. అయితే ఆ రోజు 'కేజీయఫ్‌ 3' గురించి అప్‌డేట్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొన్నీమధ్య 'కేజీయఫ్‌' నిర్మాణ హోంబలే టీమ్‌ సభ్యులు మాట్లాడుతూ 'సలార్‌' తర్వాత 'కేజీయఫ్‌ 3' పనులు ప్రారంభిస్తాం అని చెప్పారు. దీంతో యశ్‌ తర్వాతి సినిమా 'కేజీయఫ్‌ 3'నే కావొచ్చు అనే ఓ టాక్‌ కూడా నడుస్తోంది.

యశ్​
యశ్​

ABOUT THE AUTHOR

...view details