తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'కేజీఎఫ్​ 2' టీమ్​ సక్సెస్​ సెలబ్రేషన్స్​.. ఫ్యాన్స్​కు బిగ్​ సర్​ప్రైజ్​ - KGF 2 Success Celebrations:

KGF 2 Success Celebrations: 'కేజీఎఫ్ ​2' మూవీ టీమ్‌ సెలబ్రేషన్‌ మోడ్‌లో ఉంది. సినిమా బంపర్‌ హిట్‌ కావడం వల్ల ఆ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. కేక్​ కట్​ చేస్తూ సెలబ్రేషన్స్​ చేసుకున్నారు హీరో, దర్శక నిర్మాతలు.

KGF 2 Success Celebrations and Monster Song Released
KGF 2 Success Celebrations and Monster Song Released

By

Published : Apr 25, 2022, 7:14 AM IST

Updated : Apr 25, 2022, 7:45 AM IST

KGF 2 Success Celebrations: 'బాహుబలి'ని మించి 'బాహుబలి 2' సక్సెస్‌ సాధించింది. ఇప్పుడు 'కేజీఎఫ్‌' విషయంలోనూ అదే జరిగింది. మూడున్నరేళ్ల కిందట వచ్చిన 'కేజీఎఫ్' కంటే.. ఇప్పటి సెకండ్‌ చాప్టర్‌ సూపర్‌ హిట్‌ సాధించింది. బాక్సాఫీస్‌ కలెక్షన్ల విషయంలో రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.850 కోట్లు వసూలు చేసి.. రూ.వెయ్యి కోట్లు వైపు పరుగులు తీస్తోంది. ఒక్క హిందీలోనే రూ.300 కోట్ల మార్క్‌ దాటింది. రెండో వారంలోనూ తగ్గేదేలే అంటూ బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తోంది. దీంతో చిత్రబృందం పట్టరాని ఆనందంలో ఉంది.

'కేజీఎఫ్ ​2' మూవీ టీమ్‌ సెలబ్రేషన్స్

ఈ మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయిన యశ్‌తో పాటు ప్రశాంత్‌ నీల్‌ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. 'కేజీఎఫ్ ఫస్ట్​ పార్ట్​' సక్సెస్‌ సాధించినప్పుడు ఎలా అయితే ఎంజాయ్‌ చేశారో.. అచ్చం అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నారు. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, ప్రొడ్యూసర్‌ విజయ్‌ కిర్గండూర్‌.. హీరో యశ్‌కు కిస్‌ ఇస్తున్న ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ హోంబలె పిక్చర్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. సెలబ్రేషన్స్‌కు ఇది ప్రారంభం మాత్రమే అంటూ కామెంట్‌ చేసింది. ఈ ఫొటో వెంటనే సోషల్​ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

Monster Song Released: ఇప్పటికే మేకర్స్‌ 'కేజీఎఫ్ 3'ని కూడా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రేక్ష‌కుల‌కు బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 'కేజీఎఫ్​ 2' సినిమాలోని 'ఎవ్రీబ‌డీ ఈజ్ ఏ గ్యాంగ్ స్ట‌ర్‌.. టిల్ యూ సీ దా మాన్‌స్ట‌ర్' అంటూ సాగే సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. సినిమా టైటిల్ కార్డులో వ‌చ్చే ఈ పాట‌కు అదితీ సాగ‌ర్ సాహిత్యం అందించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ కీల‌క‌పాత్ర‌లో న‌టించారు.

ఇవీ చదవండి:దుబాయ్​లో రాజమౌళి, మహేష్.. కథపై చర్చలు అక్కడే!

'కొరటాల శివ వల్ల 'ఆర్​ఆర్​ఆర్​'.. రాజమౌళి వల్ల 'ఆచార్య''

Last Updated : Apr 25, 2022, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details