తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఓటీటీలోకి 'కేజీయఫ్​'.. బిగ్​బీపై ట్రోల్స్​.. 'మేజర్' అప్డేట్​ - amitab bachan trolls

కొత్త సినిమా కబుర్లు మిమ్మల్ని పలకరించేందుకు వచ్చేశాయి. ఇందులో అమితాబ్​ బచ్చన్​, యశ్​, అడివిశేష్​కు సంబంధించిన సంగతులు ఉన్నాయి. ఆ వివరాలు..

KGF 2 OTT Release
కేజీఎఫ్ ఓటీటీ రిలీజ్​

By

Published : May 16, 2022, 5:29 PM IST

KGF 2 OTT Release: యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'కేజీయఫ్‌ 2' ఇప్పటికే రూ.1200 కోట్ల కలెక్షన్లను దాటేసి ఇండియన్‌ బాక్సాఫీస్‌ కింగ్​గా నిలిచింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు తీపి కబురు వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో '‘కేజీయఫ్‌: చాప్టర్‌2' తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. అరే! భలే ఛాన్స్‌.. వెంటనే చూసేద్దాం అనుకుంటున్నారా? కాస్త ఆగండి. ఈ సినిమా ఇప్పటికిప్పుడే చూడాలంటే ముందస్తు సౌలభ్యం(ఎర్లీ యాక్సెస్‌) పేరిట అదనంగా రూ.199 చెల్లించాలంటూ 'కేజీయఫ్‌2'లో ఉన్న ట్విస్ట్‌ కన్నా అదిరిపోయే ట్విస్ట్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ ఇచ్చింది. దీంతో ఓటీటీలో 'కేజీయఫ్‌2' వచ్చేసిందనుకుంటూ ఆనందపడిపోతున్న అభిమానులు ఒక్కసారిగా ఉసూరుమంటున్నారు. అయితే, రాఖీభాయ్‌ అభిమానులు మాత్రం ‘ఛలో కేజీయఫ్‌2’ అంటున్నారు. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇచ్చిన ఆ ట్విస్ట్‌ ఏంటో చూద్దాం. 'కేజీయఫ్‌: చాప్టర్‌2' చూడాలంటే సినిమాను అద్దెకు తీసుకోవాలి. ఇందుకు రూ.199 చెల్లించాలి. ఒకసారి సినిమాను అద్దెకు తీసుకున్న తర్వాత 30 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మరొక విషయం ఒకసారి సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత 48 గంటల్లో గడువు పూర్తయిపోతుంది. అంటే ‘కేజీయఫ్‌2’ అద్దెకు తీసుకుని, చూడటం మొదలు పెడితే 48 గంటల్లో సినిమా చూసేయాలన్నమాట. అది విషయం. మే 20 జీ5 వేదికగా రాబోతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా T-VOD ప్రాతిపదిక అందుబాటులో తీసుకొస్తున్నట్లు జీ5 చెబుతోంది.

Amitab trolls: సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తాజా పోస్ట్‌పై కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఎగతాళిగా మాట్లాడారు. కారణమేంటంటే.. ఎప్పటిలానే బిగ్‌ బీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులకు ఆదివారం 'గుడ్‌ మార్నింగ్‌' విషెస్‌ చెప్పారు. 11: 26 గం.లకు ఆ పోస్ట్‌ పెట్టారు. ఈ ఒక్క చిన్న పోస్టే విమర్శలకు దారి తీసింది. 'ఇంకా ఉదయమా?', 'ఓల్డ్‌మ్యాన్‌.. ఇది ఉదయం కాదు మధ్యాహ్నం' అంటూ పలువురు వ్యంగ్యంగా కామెంట్లు పెట్టారు. వీటిపై అమితాబ్‌ తనదైన శైలిలో స్పందించారు. "నన్ను హేళన చేసినందుకు థ్యాంక్స్‌. ముఖ్యమైన పనికోసం రాత్రి చాలా సేపు మెలకువతోనే ఉన్నా. అందుకే నిద్రలేవడం ఆలస్యమైంది. లేచిన వెంటనే మీకు శుభాకాంక్షలు చెప్పా. దానికి మీరు బాధపడితే నన్ను క్షమించండి. మీ వృద్ధ్యాప్యంలో మిమ్మల్ని ఎవరూ అవమానించకూడదని దైవాన్ని ప్రార్థిస్తున్నా" అని అమితాబ్‌ బదులిచ్చారు. ఈ విషయంలో చాలామంది అమితాబ్‌కు మద్దతు పలికారు. "అమితాబ్‌ పని పట్ల ఈ వయసులోనూ ఎంత నిబద్ధతతో ఉంటున్నారో తెలియజేసేందుకు ఇది నిదర్శనం?" అని ఆయన అభిమానులు పేర్కొన్నారు.

Major movie update: 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం 'మేజర్‌'. అడివి శేష్‌ టైటిల్‌ పాత్ర పోషించగా శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్‌, ప్రకాశ్‌రాజ్‌, రేవతి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శశి కిరణ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్​ను స్పీడ్​ పెంచిన మూవీటీమ్​.. ఈ మూవీలోని ఓ పాటను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. 'ఓ ఇషా' అనే లవ్​ వీడియో సాంగ్​ను మే 18న సాయంత్రం 4.05గంటలకు విడుదల చేస్తామని తెలుపుతూ ఓ పోస్టర్​ను పోస్ట్​ చేసింది. ఫీల్​ ది ఇనోసెన్స్​ అండ్​ ది మ్యాజిక్​ ఆఫ్ లవ్​ అంటూ క్యాప్షన్​ రాసుకొచ్చింది. ఈ పోస్టర్​లో హీరోహీరోయిన్లు ఇద్దరు ఐస్​క్రీమ్​ తింటూ కబుర్లు చెబుతూ కనిపించారు. కాగా, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించారు.

ఇదీ చూడండి: సినీప్రియులకు సందడే సందడి.. ఈ వారం రిలీజ్​కు ఎన్ని సినిమాలో..

ABOUT THE AUTHOR

...view details