తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దర్శకురాలిపై చీటింగ్ కేసు.. యువ నటుడిని అశ్లీల చిత్రంలో నటించమని.. - కేరళ దర్శకురాలు నటుడిని బలవంత పెట్టింది

అశ్లీల దృశ్యంలో నటించమని ఒక నటుడ్ని(26) బలవంతం చేసినందుకు ఓ మహిళా దర్శకురాలిపై చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

kerala woman director forced an actor
kerala woman director forced an actor

By

Published : Oct 22, 2022, 4:20 PM IST

Updated : Oct 22, 2022, 4:45 PM IST

కేరళకు చెందిన ఓ దర్శకురాలిపై చీటింగ్ కేసు నమోదైంది. తనను అశ్లీల చిత్రంలో నటించమని బలవంతం చేసిందని ఓ యువ టెలివిజన్ నటుడు(26) ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. అగ్రీమెంట్​ విషయంలో తనను మోసగించి డర్టీ పిక్చర్​లో నటించేలా బలవంతం చేశారని ఓ యువ నటుడు ఆరోపించాడు. ఈ విషయమై కేరళకు చెందిన ఓ దర్శకురాలిపై విజిన్​జమ్​(Vizhinjam) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.
"అది నా తొలి షూట్​. అందుకే నేను అగ్రిమెంట్​ సరిగ్గా చదవకుండా సంతకం చేశాను. చిత్రీకరణలో పాల్గొనడానికి వారితో పాటు వెళ్లాను. వాళ్లు నన్ను ఓ రూమ్​కు తీసుకెళ్లారు. అది అడల్ట్​ చిత్రమని, నగ్నంగా నటించాలని చెప్పారు. అప్పుడు నేను నిరాకరించాను. దీంతో వాళ్లు నన్ను బలవంతం చేశారు. అగ్రిమెంట్​ను ఉల్లంఘిస్తే రూ.5 లక్షలు కట్టాలని డిమాండ్​ చేశారు. ఇదంతా ఓ మారుమూల ప్రాంతంలో జరిగింది. అక్కడి నుంచి నేను పారిపోలేకపోయాను" అని యవ నటుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సినిమా విడుదలైతే తన కుటుంబం, స్నేహితులకు తన ముఖం చూపించుకోలేనని తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
అయితే ఆ మహిళా దర్శకురాలు కూడా అతడిపై ఆరోపణలు చేసింది. సినిమా షూటింగ్ ప్రారంభించే ముందే.. నగ్నంగా నటించాలనే విషయం చెప్పి అతని అంగీకారంతోనే సినిమా చిత్రీకరించినట్లు తెలిపింది. సినిమాలో నటీనటులు తమ కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకున్నారని, ఒప్పందంపై సంతకాలు చేయటం కూడా వీడియోలో చిత్రీకరించామని పేర్కొంది.

Last Updated : Oct 22, 2022, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details