తెలంగాణ

telangana

By

Published : Nov 30, 2022, 3:53 PM IST

ETV Bharat / entertainment

ఆ రాష్ట్రంలో 'అవతార్‌-2' ప్రదర్శన రద్దు..కారణం ఇదే..?

అవతార్​-2 సినిమా కోసం సినీప్రియులు ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 16న ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఆ రాష్ట్రంలో విడుదలకు నో చెప్పారంటా..! ఎందుకంటే.?

avatar
అవతార్‌-2

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న 'అవతార్‌-2'. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ 16న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు జేమ్స్ కామెరూన్‌ బృందం సన్నాహాలు చేస్తోన్న వేళ.. కేరళలో ఈ సినిమా ప్రదర్శనకు చుక్కెదురైంది.

ఆ రాష్ట్రంలోని సుమారు 400 థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోమంటూ ది ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ యునైటెడ్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కేరళ (ఎఫ్‌ఈయుఓకే) మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

అవతార్‌-2

లాభాలను పంచుకునే విషయంలో థియేటర్‌ యజమానులు, డిస్ట్రిబ్యూటర్స్‌ మధ్య ఏర్పడిన వివాదం కారణంగా ఎఫ్‌ఈయుఓకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాటాల విషయంలో డిస్ట్రిబ్యూటర్స్‌ పెట్టిన షరతులను తాము అంగీకరించడం లేదని, అందుకే ఎఫ్‌ఈయుఓకే పరిధిలోని థియేటర్స్‌లో 'అవతార్‌-2' ప్రదర్శన రద్దు చేశామని, ఈ విషయంపై త్వరలోనే చర్చలు జరుగుతాయని తాము భావిస్తున్నామంటూ ఎఫ్‌ఈయుఓకే అధ్యక్షుడు విజయకుమార్‌ తెలిపారు.

ఇవీ చదవండి:ఆ తమిళ హీరో కోసం తినకుండా రాత్రంతా ప్రభాస్ వెయిట్​ చేశారట!

తెలుగు తెరపై మరో కన్నడ అందం సరైన సినిమాతోనే వస్తున్నానంటూ

ABOUT THE AUTHOR

...view details