తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సన్నీ లియోనీకి హైకోర్టులో ఊరట.. 'కాంట్రాక్ట్​' కేసుపై స్టే

Sunny Leone Kerala High Court : బాలీవుడ్​ నటి సన్నీ లియోనీకి సంబంధించిన ఒప్పంద ఉల్లంఘన కేసుపై స్టే విధించింది కేరళ హైకోర్టు. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

sunny leone kerala high court
sunny leone kerala high court

By

Published : Nov 16, 2022, 3:31 PM IST

Sunny Leone Kerala High Court : బాలీవుడ్​ నటి సన్నీ లియోనీకి సంబంధించిన ఒప్పంద ఉల్లంఘన కేసులో కేరళ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. సన్నీ సహా అతడి భర్త, మేనేజర్​పై నమోదైన కేసుపై స్టే విధించింది. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అంతకుముందు క్రైమ్​ పోలీసుల విచారణను ఎదుర్కొన్న సన్నీ.. కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం ఇలా తీర్పునిచ్చింది.

అసలేం జరిగింది?
కేరళకు చెందిన ఓ ఈవెంట్​ సంస్థతో సన్నీ లియోనీ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2016 నుంచి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఇందుకోసం ఆమెకు రూ.29 లక్షలు కూడా ఇచ్చారు. అయితే తమ దగ్గర డబ్బులు తీసుకుని, ఈవెంట్లకు సన్నీ హాజరు కాలేదని ఈవెంట్​ మేనేజర్ శియాస్, కేరళ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమెను విచారించిన పోలీసులు.. వాంగ్మూలం తీసుకున్నారు.

అయితే ఈ విషయంలో తన తప్పు ఏమీ లేదని సన్నీ చెబుతోంది. ఈవెంట్ ఆర్గనైజర్ అబద్ధాలు ఆడుతున్నాడని తెలిపింది. కార్యక్రమాలు జరిగే తేదీల గురించి సరిగ్గా చెప్పకపోవడం వల్ల చాలాసార్లు మిగతా ప్రాజెక్టుల షెడ్యూల్స్ మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పింది. తనకు రావాల్సిన డబ్బు కూడా వారు సకాలంలో చెల్లించలేదని సన్నీ స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:ఏంటీ కృతి వేసుకున్న డ్రెస్ రూ.68 వేలా

ఫుల్​ ట్రెండింగ్​లో విజయ్​ 'రంజితమే' సాంగ్​.. యూట్యూబ్‌ షేక్​

ABOUT THE AUTHOR

...view details