చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ షటిల్ ఆడే క్రమంలో పాయింట్ల కోసం కోర్టులో వాగ్వాదానికి దిగుతారు. పాయింట్ నాకు అంటే నాకు అని వాదనకు దిగుతారు. అచ్చం అదే రీతిలో నేచురల్ స్టార్ నాని, క్యూట్ కీర్తి సురేశ్ మధ్య క్యూట్ వాగ్వాదం జరిగింది. ఇటీవల నాని పుట్టిన రోజు సందర్భంగా కీర్తి ఆ వీడియోను షేర్ చేస్తూ.. నానీకు బర్త్‌డే విషెస్ తెలిపారు.
"ఎప్పుడూ సినిమా గురించి మాత్రమే మాట్లాడే నా స్నేహితుడు, శ్రేయోభిలాషి, నా తోటి నటుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మన సినిమా సెలబ్రేషన్స్‌కు ఇంకా 40 రోజుల కన్నా తక్కువే ఉన్నాయి. 2023ను కుమ్మేసేయ్ ధరణి" అంటూ వారిద్దరూ కలిసి నటించిన 'దసరా' సినిమా గురించి చెప్పుకొచ్చారు కీర్తి. వీడియోను కూడా 'దసరా' సినిమా సెట్లోనే తీసినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.