తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

గోదావరిఖనిలో వెన్నెల.. ఆ చిత్రంలోంచి బయటకు వచ్చిన రష్మిక.. 'యశోద' విడుదల అప్పుడే - కీర్తి సురేశ్ నాని దసరా సినిమా

అందాల తార కీర్తి సురేశ్​ పుట్టినరోజు సందర్భంగా ఆమె కొత్త చిత్రం నుంచి ఫస్ట్​ లుక్​ను రిలీజ్​ చేసింది సినిమా యూనిట్​. కాగా, కొత్త సినిమాలోంచి రష్మిక బయటకు వచ్చేసింది. మరోవైపు సమంత నటిస్తోన్న 'యశోద' చిత్రంలోంచి మరో అప్డేట్​ వచ్చింది.

keerthy suresh malavika mohanan samantha updates
keerthy suresh malavika mohanan samantha updates

By

Published : Oct 18, 2022, 10:01 AM IST

Updated : Oct 18, 2022, 11:01 AM IST

నాని కథానాయకుడిగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'దసరా'. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. కీర్తి సురేష్‌ కథానాయిక. సముద్రఖని, సాయికుమార్, జరీనా వహాబ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సోమవారం కీర్తి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఇందులో తను వెన్నెల అనే పల్లెటూరి యువతిగా డీగ్లామర్‌ లుక్‌లో కనువిందు చేయనుంది.

'దసరా'లో కీర్తి సురేశ్​

ప్రచార చిత్రంలో ఆమె పెళ్లి కూతురిగా పసుపు చీర కట్టుకొని డప్పుల దరువుకు హుషారుగా స్టెప్పేస్తూ కనిపించింది. "గోదావరిఖనిలోని బొగ్గు గనులకు దగ్గరగా ఉండే ఓ గ్రామ నేపథ్యంలో జరిగే కథ ఇది. నాని మాస్‌ యాక్షన్‌ పాత్రలో కనిపించనున్నారు. కీర్తి పాత్రకు ఎంతో ప్రాధాన్యముంది. చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది" అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 30న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ స్వరాలందిస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ ఛాయాగ్రహాకుడిగా వ్యవహరిస్తున్నారు.

రష్మిక ఔట్.. మాళవిక ఇన్..
విక్రమ్‌ నటిస్తోన్న 61వ చిత్రం టెస్ట్‌ షూటింగు మొదలైన సంగతి తెలిసిందే. పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ముందు రష్మికను తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ స్థానంలో మరో భామ వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న ప్రకారం రష్మిక నటించాల్సి ఉన్నా ఆమె కాల్షీట్లు సర్దుబాటు కావడం లేదు. దీంతో మాళవిక మోహనన్‌ తీసుకున్నట్లు సమాచారం. మాళవికకు ఇది నాలుగో తమిళ చిత్రం. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం నుంచి కడపలో మొదలైంది. తమిళంతో పాటు హిందీలోనూ చిత్రీకరించి పాన్‌ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

'యశోద' విడుదల అప్పుడే..
సమంత ప్రధాన పాత్రలో హరి, హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం 'యశోద'. శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మాత. వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబరు 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

'యశోద'లో సమంత

ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ.. "ఇదొక న్యూఏజ్‌ థ్రిల్లర్‌. భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. టైటిల్‌ పాత్రలో సమంత అద్భుతంగా నటించారు. యాక్షన్‌ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఆమె స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్నారు. మణిశర్మ నేపథ్య సంగీతం కొత్త కోణంలో ఉంటుంది" అన్నారు. ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్, ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్‌.

ఇవీ చదవండి :సచిన్​ను కలిసిన ఏఆర్​ రెహ్మాన్.. మ్యాటర్​ ఏంటంటే?​

హాట్​ హాట్ భామలు అదిరిపోయే అందాలు చూస్తే కిక్కే కిక్కు

Last Updated : Oct 18, 2022, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details