తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Keerthy Suresh Marriage : ఆ మ్యూజిక్​ డైరెక్టర్​తో కీర్తి సురేశ్​ పెళ్లి.. నటి తండ్రి క్లారిటీ - కీర్తి సురేశ్​ సినిమాలు

Keerthy Suresh Marriage News : ప్రముఖ నటి కీర్తి సురేశ్​ పెళ్లి వార్త మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఓ ప్రముఖ సంగీత దర్శకుడితో కీర్తి పెళ్లిపీటలెక్కబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై కీర్తి సురేశ్ తండ్రి సురేశ్​ కుమార్ అధికారికంగా స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

Keerthy Suresh Marriage News
Keerthy Suresh Marriage News

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 9:25 PM IST

Updated : Sep 17, 2023, 10:40 PM IST

Keerthy Suresh Marriage News : తన అందం, అభినయంతో జాతీయ అవార్డు గెలుచుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి కీర్తి సురేశ్​. ఇప్పుడు ఈ సుందరి పెళ్లి వార్త మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్​తో ఆమె వివాహం జరగనుందనే ఊహాగానాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై కీర్తి సురేశ్‌ తండ్రి సురేశ్‌ కుమార్‌ (Keerthy Suresh Father Name) స్పందించారు. ఆ వార్తల్లో నిజంలేదని వాటిని ఖండించారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి రూమర్స్‌ సృష్టిస్తున్నారన్నారు. అయితే కీర్తి సురేశ్‌ పెళ్లిపై రూమర్స్​ రావడం ఇది మొదటి సారి కాదు. గతంలో ఇలాగే పలుమార్లు వదంతులు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. అయితే కీర్తి, ఆమె కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఖండించినా ఇలాంటి రూమర్స్​ వస్తున్నాయి.

Keerthy Suresh And Anirudh Marriage : కొన్నాళ్ల క్రితమే కీర్తి సురేశ్​, అనిరుధ్​ ప్రేమలో ఉన్నారని.. త్వరలో వివాహం చేసుకోబోతున్నారని ఓ ఆంగ్ల పత్రికలో వార్తలు వచ్చాయి. సోషల్​ మీడియాలో ఈ విషయంపై నెటిజన్లు పోస్టులు పెట్టి చర్చించారు. అప్పుడు కీర్తి సురేశ్​ ఆ వార్తలను కొట్టిపారేసింది. తన పెళ్లిపై అలాంటి పోస్టులు చూసి షాకయ్యానని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 'కొంత మంది నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఇప్పటికే, మూడు, నాలుగుసార్లు నాకు పెళ్లి చేసేశారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటా. అనిరుధ్‌ నాకు మంచి స్నేహితుడు' అని క్లారిటీ ఇచ్చింది.

Keerthy Suresh Wedding :మరో సందర్భంలో తన స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను కీర్తి సురేశ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. 'కీర్తికి కాబోయే భర్త ఇతడే' అంటూ పలు వెబ్‌సైట్లు కథనాలు ప్రచురించాయి. ఆ సమయంలో కీర్తి సురేశ్​ తండ్రి వాటిని ఖండించారు. ఓ వీడియో కూడా విడుదల చేసి వివరణ ఇచ్చారు.. అందులో 'కీర్తి సురేశ్‌కు పెళ్లి కుదిరితే మీడియాకు, ప్రజలకు ముందుగా మేమే చెబుతాం. ఇలాంటి సెన్సిటివ్ విషయాలపై వదంతులు సృష్టించొద్దు. వీటి కారణంగా కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోతుంది' అసహనం వ్యక్తం చేశారు.

Keerthy Suresh Movies : ఇటీవల 'భోళా శంకర్‌'తో టాలీవుడ్​లో సందడి చేసింది కీర్తి సురేశ్​. అంతకుముందు తమిళ సినిమా 'మామన్నన్‌'లో మెరిసింది. నానితో కలిసి చేసిన 'దసరా'తో కలిపి ఈ ఏడాది మూడు సినిమాల్లో కీర్తి ఆడిపాడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు అనిరుధ్​.. జైలర్', 'జవాన్‌' చిత్రాలు ఇచ్చిన విజయోత్సాహంలో ఉన్నారు. సూర్య 'లియో', ఎన్​టీఆర్​ 'దేవర' తదితర సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్.. పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​తో నటించిన 'అజ్ఞాతవాసి', శివకార్తికేయన్​తో చేసిన 'రెమో' తదితర చిత్రాలకు అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.

KEERTHY SURESH: కీర్తి సురేశ్ అభిమానులకు శుభవార్త

గొడవపడిన నాని-కీర్తి సురేశ్.. వీడియో నెట్టింట వైరల్

Last Updated : Sep 17, 2023, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details