తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మంచి మనసు చాటుకున్న కీర్తి సురేశ్​.. 'దసరా' యూనిట్​కు కాస్ట్లీ గోల్డెన్​ గిఫ్ట్స్​..

హీరోయిన్​ కీర్తి సురేశ్​ మరోసారి తన మంచి మనసు చూటుకున్నారు. 'దసరా' సినిమా షూటింగ్​ అనంతరం చిత్ర యూనిట్​కు ఊహించిన కానుకలు ఇచ్చారు. ఆమె సర్​ప్రైజ్​ పట్ల చిత్రబృందం ఆశ్చర్యపోయింది. ఇంతకీ కీర్తి ఏం ఇచ్చారంటే?

keerthy suresh gave expensive gifts to dasara movie unit members
keerthy suresh gave expensive gifts to dasara movie unit members

By

Published : Jan 20, 2023, 4:57 PM IST

Updated : Jan 20, 2023, 6:13 PM IST

అలనాటి తార సావిత్రి బయోపిక్​ 'మహానటి' సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు హీరోయిన్ కీర్తి సురేశ్​. ఈ సినిమాలో అద్భుతంగా నటించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్​ను కూడా అందుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఓ వైపు స్టార్​ హీరోలతో కమర్షియల్​ సినిమాలు చేస్తూనే.. మరవైపు లేడీ ఓరియెంటెడ్​ సినిమాల్లో నటిస్తున్నారు.

నాని, కీర్తి సురేశ్​

తాజాగా టాలీవుడ్​ నేచురల్ స్టార్​ నానితో దసరా సినిమా చేశారు. అయితే ఇటీవలే ఈ చిత్ర షూటింగ్​ పూరైంది. దీంతో షూటింగ్ చివరి రోజున.. చిత్ర యూనిట్​కు కీర్తి.. బంగారు కానుకలు ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఈ మూవీ కోసం పనిచేసిన ఒక్కొక్కరికి రెండు గ్రాముల బంగారు నాణేలు ఇచ్చారు. ఈ బంగారు నాణేల కోసం కీర్తి.. సుమారు రూ.13 లక్షలు ఖర్చు చేశారట. బంగారు నాణేలు అందుకున్న చిత్ర బృంద సభ్యులు సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు చెబుతున్నారు.

సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో నూతన దర్శకుడు శ్రీకాంత్​ ఓదెల ఈ సినిమాకు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నాని ఎన్నడూ కనిపించని లుక్​లో కనిపించబోతున్నారు. ఇప్పటికే నాని రఫ్​ లుక్​కు సంబంధించిన ఫొటోలను మేకర్స్​ రిలీజ్​ చేశారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుందీ చిత్రం.

దసరా మూవీలో నాని, కీర్తి సురేశ్​
Last Updated : Jan 20, 2023, 6:13 PM IST

ABOUT THE AUTHOR

...view details